Praveena Paruchuri | ‘కేరాఫ్ కంచరపాలెం’, ‘ఉమా మహేశ్వర ఉగ్రరూపస్య’ లాంటి చిత్రాలతో సూపర్ హిట్లను అందుకున్న నిర్మాత ప్రవీణ పరుచూరి ఇప్పుడు మెగాఫోన్ పట్టి దర్శకురాలిగా మారింది. ఆమె దర్శకత్వంలో రాబోతున్న తాజా చిత్రం కొత్తపల్లిలో ఒకప్పుడు(Kothapallilo Okappudu). దగ్గుబాటి రానా ఈ సినిమాకు సమర్పకుడిగా వ్యవహారిస్తుండగా.. పరచూరి విజయ్ ప్రవీణ ఆర్ట్స్ బ్యానర్‌పై గోపాలకృష్ణ పరుచూరి & ప్రవీణ పరుచూరి నిర్మిస్తున్నారు. రూరల్ బ్యాక్‌డ్రాప్‌లో రాబోతున్న ఈ సినిమా జూలై 18న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ సందర్భంగా మూవీ నుంచి ట్రైలర్‌ను విడుదల చేశారు మేకర్స్. కామెడీ బ్యాక్‌డ్రాప్‌లో ఈ సినిమా రాబోతుంది. ఈ సినిమాతో మనోజ్ చంద్ర, మోనిక టి, ఉషా బోనెలను వెండితెరకు పరిచయం చేస్తుండగా.. రవీంద్ర విజయ్, బెనర్జీ, బొంగు సత్తి, ఫణి, ప్రేంసాగర్ తదితరులు కీలక పాత్రలో నటిస్తున్నారు.