టాలీవుడ్ స్టార్ హీరో జూనియర్ ఎన్టీఆర్ (Jr NTR) తో పాన్ ఇండియా డైరెక్టర్ ప్రశాంత్ నీల్ (Prashanth Neel) ఎన్టీఆర్31 (NTR 31) సినిమా చేస్తున్నాడని ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. కొన్నాళ్ల క్రితం ఈ ప్రాజెక్ట్ కు సంబంధించిన అప్డేట్ కూడా బయటకు వచ్చింది. తాజాగా ఓ వార్త నెట్టింట్లో చక్కర్లు కొడుతోంది. ప్రశాంత్ నీల్ ఈ సినిమాను ఒకే టైంలో తెలుగు, కన్నడ భాషల్లో చిత్రీకరించేందుకు ప్లాన్ చేస్తున్నాడట. ఎన్టీఆర్ కన్నడలో చాలా పర్ఫెక్ట్గా మాట్లాడతాడని అందరికీ తెలిసిందే.
ప్రశాంత్ నీల్ టీం ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని ఎన్టీఆర్ 31 మూవీని తెలుగులో తెరకెక్కించి ఇతర భాషల్లో డబ్బింగ్ చేయడం కంటే కన్నడ వెర్షన్‌పైనే ఎక్కువ ఫోకస్ పెడితే బాగుంటుందని అనుకుంటుందని తాజాగా ఓ వార్త ఫిలింనగర్ సర్కిల్లో హల్ చల్ చేస్తోంది. ప్రస్తుతం ప్రశాంత్ నీల్ పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్‌తో సలార్ షూటింగ్లో బిజీగా ఉన్నాడు. ఈ చిత్రాన్ని తెలుగులో తెరకెక్కించి.. ఇతర భాషల్లో విడుదల చేయనున్నారు మేకర్స్.
కాగా ఇటీవలే ఆర్ఆర్ఆర్ జపాన్ ప్రమోషన్స్ లో పాల్గొన్న తారక్ త్వరలోనే కొరటాల శివతో చేయబోతున్న ఎన్టీఆర్ 30 సినిమాపై ఫోకస్ పెట్టనున్నాడు. ఈ చిత్రంలో తారక్ ఇదివరకెన్నడూ కనిపించని కొత్త లుక్‌లో సందడి చేయబోతున్నాడని ఇన్ సైడ్ టాక్. ఇప్పటికే తారక్ న్యూ మేకోవర్ స్టిల్స్ కూడా నెట్టింటిని షేక్ చేస్తున్నాయి.
Read Also : Super star Krishna | కృష్ణ మరణంతో ట్రైలర్ వాయిదా వేసిన దిల్ రాజు టీం..!
Read Also : Suprerstar Krishna | కృష్ణ చివరి సినిమా ఇదే.. ఒకే హీరోయిన్‌తో 43 సినిమాలు..
Read Also : Super Star Krishna | తెలుగులో స్పై జోనర్ సినిమాలకు కేరాఫ్ అడ్రస్.. సూపర్ స్టార్