Prashanth Neel | కేజీఎఫ్, సలార్ చిత్రాల ఫేం దర్శకుడు ప్రశాంత్ నీల్ బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్‌కు క్షమాపణలు చెప్పాడు. గత ఏడాది షారుఖ్ ఖాన్ సినిమా డంకీతో పాటు ప్రభాస్ సలార్ సినిమాలు ఒకేసారి విడుదలైన విషయం తెలిసిందే. సంవత్సరం ముందే ఆ డేట్‌ని ఫిక్స్ చేసుకున్న షారుఖ్ డంకీతో ప్రేక్షకుల ముందుకు రాగా.. సడన్‌గా ఈ రేసులో మేము కూడా ఉన్నామని చెబుతూ.. ప్రశాంత్ నీల్ ప్రభాస్ సలార్‌ని దింపాడు.
అయితే ఈ రెండు సినిమాలు ఒకే సారి రావడంతో అటు బాక్సాఫీస్ క్లాష్‌తో పాటు ప్రేక్షకులు నార్త్ వర్సెస్ సౌత్‌గా విడిపోయారు. కొందరు ఏమో సినిమాని సినిమాగా చూస్తే.. మరికొందరూ ఫ్యాన్ వార్ సృష్టించారు. అయితే సలార్ చిత్రం డిసెంబర్లో విడుదల కావడం వలన షారుఖ్ డంకీ సినిమాగా చాలా పెద్ద దెబ్బ పడింది. అప్పటివరకు షారుఖ్ సోలోగా వస్తున్నాడు జవాన్, పఠాన్ల తర్వాత ఇది కూడా బ్లాక్ బస్టర్ అవుతుందని భావించారు. కానీ ఊహించని విధంగా ప్రభాస్ సలార్‌తో రావడంతో అటు డంకీ తక్కువ థియేటర్లలో విడుదల అవ్వడమే కాకుండా కలెక్షన్లపై కూడా ప్రభావం పడింది.
అయితే ఈ వివాదంపై తాజాగా స్పందించాడు సలార్ దర్శకుడు ప్రశాంత్ నీల్. డంకీ సినిమా విడుదల సమయంలో సలార్‌ను తీసుకువచ్చి తప్పు చేశాం. ఈ విషయంలో షారుఖ్ ఖాన్‌కి, దర్శకుడు రాజ్ కుమార్ హిరానీకి క్షమాపణలు చెబుతున్నా అంటూ ప్రశాంత్ చెప్పుకొచ్చాడు. దీంతో ఇప్పటికైనా ఈ వివాదం ముగిసిపోయిందని సినీ వర్గాలు చర్చించుకుంటున్నాయి.