Prashant Varma | ఒక్క సినిమాతో దర్శకుడు ప్రశాంత్ వర్మ రేంజ్ పూర్తిగా మారిపోయింది. ‘హను-మాన్’ ఘన విజయం తర్వాత ప్రశాంత్ వర్మ కోసం నిర్మాతలు క్యూ కడుతున్నారు. హను మాన్ సక్సెస్‌తో ఇప్పటికి రెండు మూడు సినిమాలు సెట్స్‌పైకి వెళ్లాల్సి ఉండగా, ఆయన మాత్రం అనౌన్స్మెంట్స్ వరకే పరిమితమవుతున్నట్టు కనిపిస్తోంది. ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్ (PCU) నుంచి ‘మహాకాళి’, ‘జై హనుమాన్’, ‘అధీర’ వంటి భారీ ప్రాజెక్టులను అధికారికంగా ప్రకటించారు.ఇవే కాకుండా నందమూరి బాలకృష్ణ కుమారుడు నందమూరి మోక్షజ్ఞతో ఒక సినిమా అనౌన్స్మెంట్ కూడా జరిగింది.
అలాగే బాలీవుడ్ స్టార్ రణ్వీర్ సింగ్‌తో ఓ పాన్ ఇండియా మూవీ ప్రకటించి ఆ తర్వాత అప్డేట్ లేకుండానే ఆగిపోయింది. మధ్యలో ప్రభాస్‌తో ‘బ్రహ్మారాక్షస్’ తెరకెక్కించబోతున్నారన్న ప్రచారం కూడా గట్టిగానే సాగింది. అయితే నిర్మాతతో విభేదాల కారణంగా ప్రశాంత్ వర్మ వివాదంలో చిక్కుకోవడంతో ఆ ప్రాజెక్ట్ నుంచి ప్రభాస్ తప్పుకున్నారని టాక్ వినిపించింది.ఇప్పటికీ ‘బ్రహ్మారాక్షస్’ సినిమాను పూర్తి చేయాలనే పట్టుదలతో ఉన్న ప్రశాంత్ వర్మ, ఈ కథను ఎన్టీఆర్‌కు వినిపించాడన్న ప్రచారం జరుగుతోంది. అయితే ఎన్టీఆర్ ప్రస్తుతం ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ‘డ్రాగన్’ను రెండు భాగాలుగా తెరకెక్కిస్తున్నారు. ఆ తర్వాత ‘దేవర పార్ట్ 2’ను పూర్తి చేయాల్సి ఉంది. ‘దేవర 2’ ఆగిపోయిందనే వార్తలు వచ్చినా, ఈ సినిమాను పూర్తి చేయాలనే నిర్ణయంలో తారక్ ఉన్నారని సమాచారం.
అంతేకాదు, తమిళ దర్శకుడు నెల్సన్ దిలీప్ కుమార్‌తో కూడా ఎన్టీఆర్ ఓ సినిమా చేయబోతున్నట్టు టాక్ ఉంది. వీటికన్నా ముందుగా త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో ‘మురుగ’ అనే ప్రాజెక్ట్ కూడా లైన్లో ఉంది. ఈ బిజీ షెడ్యూల్ దృష్ట్యా ప్రశాంత్ వర్మతో సినిమా చేయాలంటే ఎన్టీఆర్ కనీసం మూడు నుంచి నాలుగు సంవత్సరాలు ఎదురుచూడాల్సిన పరిస్థితి ఉందని సినీ వర్గాలు చెబుతున్నాయి. ప్రస్తుతం ప్రశాంత్ వర్మ కన్నడ స్టార్ రిషబ్ శెట్టితో ‘జై హనుమాన్’ సినిమాను సెట్స్‌పైకి తీసుకెళ్లారు. అయితే ఈ మూవీ షూటింగ్ అనుకున్న దానికంటే నెమ్మదిగా సాగుతోందని సమాచారం. అలాగే ముందే ప్రకటించిన ‘మహాకాళి’, ‘అధీర’ సినిమాల విషయంలోనూ వివాదాలు కొనసాగుతున్నాయట. దీంతో ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో వచ్చే తదుపరి సినిమా ఎప్పుడు థియేటర్లలోకి వస్తుందన్నదానిపై అభిమానుల్లో ఉత్కంఠ కొనసాగుతోంది.