Prasanth Varma | ‘హనుమాన్’ దర్శకుడు పాన్ ఇండియా లేటెస్ట్ సెన్సేషన్ ప్రశాంత్వర్మ (Prashanth Varma) బంపర్ ఆఫర్ ప్రకటించాడు. తన సినిమాలో పనిచేయుటకు పోస్టర్ డిజైనర్లు కావాలని ఎక్స్ వేదికగా పోస్ట్ పెట్టాడు. ప్రశాంత్ వర్మ ప్రస్తుతం జై హనుమాన్(Jai Hanuman) అనే సినిమాకు దర్శకత్వం వహిస్తున్న విషయం తెలిసిందే. బ్లాక్ బస్టర్ ‘హనుమాన్’ సినిమాకు సీక్వెల్గా వస్తున్న ఈ సినిమా ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది. రీసెంట్గా శ్రీరామ నవమి సందర్భంగా మూవీ నుంచి ఫస్ట్ లుక్ పోస్టర్ను కూడా పంచుకున్నాడు. ఇక ఈ పోస్టర్లో రాముడి చేతిలో హనుమంతుడు చేయి వేసినట్లు పోస్టర్ కనిపిస్తుంది. అయితే ఈ సినిమాకు సంబంధించి పోస్టర్ డిజైనర్ల కోసం జాబ్ ఆఫర్ చేశాడు ప్రశాంత్ వర్మ.
ఈ విషయాన్ని ఎక్స్ వేదికగా ప్రకటిస్తూ.. పోస్టర్ డిజైనర్ల కోసం చూస్తున్నాం. ఇది ఫుల్ టైం జాబ్. సినిమాలు అంటే పిచ్చి ఉన్నా ప్రతిభావంతులు మీకు ఈ రోల్ ఇంట్రెస్ట్ ఉంటే talent@thepvcu.com ద్వారా మమ్మల్ని సంప్రదించండి అంటూ ప్రశాంత్ వర్మ రాసుకోచ్చాడు.
Looking for poster designers. Full time job. Please reach out.. talent@thepvcu.com
— Prasanth Varma (@PrasanthVarma) June 6, 2024