Prasanth Varma| టాలీవుడ్ యువ హీరో తేజ సజ్జా (Tejasajja) కాంపౌండ్ నుంచి వస్తున్న పాన్ ఇండియా ప్రాజెక్ట్ హనుమాన్ (HanuMan). తొలి తెలుగు సూపర్ హీరో సిరీస్‌గా వస్తోన్న ఈ చిత్రానికి ప్రశాంత్‌వర్మ (Prasanth Varma) దర్శకత్వం వహిస్తున్నాడు. ఇప్పటికే లాంఛ్ చేసిన హనుమాన్ టీజర్ నెట్టింట్లో హల్ చల్ చేస్తూ.. సినిమాపై అంచనాలు పెంచేస్తుంది. 2024 జనవరి 12న ప్రేక్షకుల ముందుకు రానుంది. మరోవైపు మహేశ్ బాబు నటిస్తోన్న గుంటూరు కారం కూడా ఇదే రోజు వస్తోంది. హనుమాన్ ట్రైలర్ లాంఛ్ ఈవెంట్లో ఇదే విషయంపై క్లారిటీ ఇచ్చాడు ప్రశాంత్ వర్మ.
గుంటూరు కారం, హనుమాన్ ఒకే రోజు విడుదల కానున్న నేపథ్యంలో పోటీ ఎలా ఉండబోతుందనే దానిపై ప్రశాంత్ వర్మ మాట్లాడుతూ..
తొలిసారి మేమే విడుదల తేదీని ప్రకటించాం. జనవరి 12న ఏ సినిమా రిలీజ్ కాదేమోననుకున్నాం. విడుదల తేదీ ప్రకారం నార్త్ బెల్ట్‌లో థియేటర్లతో ఒప్పందం కుదుర్చుకున్నాం. ఈ నేపథ్యంలో విడుదల తేదీ గురించే విబేధించే ప్రసక్తే లేదు. మహేశ్ బాబు చాలా పెద్ద స్టార్ యాక్టర్. గుంటూరు కారం సినిమాను నేను మొదటి రోజే చూస్తానని చెప్పుకొచ్చాడు.
ట్రైలర్లో.. పవర్ సూట్లో ఉంటే సరిపోదు.. సిరి.. నాలో ఉండాలి.. నా నరనరాల్లో ఉండాలి. అలాంటి పవర్ ఎక్కడ ఉంది..అంటున్నాడు విలన్. ఇక పోలేరమ్మ మీద ఒట్టు.. నా తమ్ముడి మీద చెయ్యి పడితే టెంకాయలు పగిలిపోతాయంటోంది వరలక్ష్మి శరత్‌కుమార్. మానవాళి మనుగడను కాపాడేందుకు నీ రాక అనివార్యం హనుమాన్ అనే సంభాషణలతో.. అదిరిపోయే బీజీఎంతో సాగుతున్న విజువల్స్ సినిమాపై క్యూరియాసిటీ పెంచుతున్నాయి. హనుమాన్ హాలీవుడ్ స్థాయికి తగ్గకుండా ఉండబోతుందని ఇప్పటికే టీజర్‌తో ఇప్పటికే క్లారిటీ ఇచ్చేశాడు.
హనుమాన్ చిత్రాన్ని ప్రైమ్ షో ఎంటర్టైన్మెంట్ బ్యానర్‌పై కే నిరంజన్ రెడ్డి నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో కోలీవుడ్ భామ అమృతా అయ్యర్ ఫీ మేల్ లీడ్ రోల్లో నటిస్తోండగా.. వరలక్ష్మి శరత్ కుమార్, వినయ్ రాయ్, రాజ్ దీపక్ శెట్టి, వెన్నెల కిశోర్ కీలక పాత్రలు పోషిస్తున్నారు.
ఈ మూవీకి గౌరా హరి-అనుదీప్ దేవ్, కృష్ణ సౌరభ్ సంయుక్తంగా మ్యూజిక్, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అందిస్తున్నారు. శ్రీమతి చైతన్య సమర్పణలో వస్తోన్న ఈ చిత్రానికి ఈ అస్రిన్ రెడ్డి ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్‌గా, వెంకట్ కుమార్ జెట్టీ లైన్ ప్రొడ్యూసర్‌గా, కుశాల్ రెడ్డి అసోసియేట్ ప్రొడ్యూసర్‌గా వ్యవహరిస్తున్నారు.
Director @PrasanthVarma elated speech at #HanumanTrailer Launch Event
🌟ing @tejasajja123#HANUMAN In WW Cinemas from JAN 12, 2024!@Niran_Reddy @Actor_Amritha @varusarath5 @VinayRai1809 @GowrahariK @Chaitanyaniran @AsrinReddy @Primeshowtweets… pic.twitter.com/e0AmEG7Xf5
— BA Raju’s Team (@baraju_SuperHit) December 19, 2023
హనుమాన్ ట్రైలర్..
When DARKNESS eclipses DHARMA, The ANCIENTS shall RISE again 🔥
Embark on a surreal odyssey,#HanuManTrailer Out Now ❤️🔥
A @PrasanthVarma Film
🌟ing @tejasajja123 #HanuMan In cinemas from JAN 12, 2024 💥@Niran_Reddy @Actor_Amritha @varusarath5… pic.twitter.com/7rNODREH2r— BA Raju’s Team (@baraju_SuperHit) December 19, 2023
Avakaya Anjaneya సాంగ్ లుక్..
Massy beats repu #AvakayaAnjaneya
3rd Single from #HANUMAN Releasing Tomorrow, 28th NOV @ 4:05 Pm🎶
A @PrasanthVarma Film @anudeepdev 🥁#HANUMAN from JAN 12th,2024💥@Niran_Reddy @Primeshowtweets @RKDStudios pic.twitter.com/YRSN61UVXb
— Teja Sajja (@tejasajja123) November 27, 2023
Sound mixing for #HanuMan has begun! 🙏🏽
Experience the immersive audio journey we are creating in #DolbyAtmos ! 😊@Primeshowtweets pic.twitter.com/fGCyU8O2NS
— Prasanth Varma (@PrasanthVarma) November 23, 2023
హనుమాన్ అండర్ వాటర్ షాట్స్..
After a phenomenal response to the epic teaser
Team #HanuMan shot a breath-taking underwater sequence on a grand scale that will leave the audience spellbound 💥
A @PrasanthVarma Film
🌟ing @tejasajja123 @Actor_Amritha @Niran_Reddy @Chaitanyaniran @Primeshowtweets pic.twitter.com/ry4K18UGg3— Vamsi Kaka (@vamsikaka) December 20, 2022
హనుమాన్ టీజర్.. వీడియో