‘కేజీఎఫ్’తో రాత్రికి రాత్రి పాన్ ఇండియా స్టార్‌గా అవతరించారు కన్నడ స్టార్ హీరో యశ్. ‘హను-మాన్’ విజయంతో యావత్ భారతీయ సినిమా దృష్టినే ఆకర్షించారు దర్శకుడు ప్రశాంత్‌వర్మ. ప్రస్తుతం ‘టాక్సిక్’, ‘రామాయణ’ చిత్రాలతో యశ్ బిజీగా ఉంటే, రిషబ్‌శెట్టితో పాన్ ఇనిండియా స్థాయిలో ‘జై హనుమాన్’ని తెరకెక్కిస్తూ ఆడియన్స్‌లో ఆసక్తిని పెంచుతున్నారు ప్రశాంత్‌వర్మ.
తాజాగా వీరిద్దరి కాంబినేషన్లో సినిమా అంటూ ఇండస్ట్రీ వర్గాల్లో చర్చ నడుస్తున్నది. ఇటీవలే తన తదుపరి ప్రాజెక్ట్ కోసం యశ్ని సంప్రదించారట ప్రశాంత్‌వర్మ. ఈ వార్త నిజమే అయితే.. ఆ సినిమా సౌతిండియన్ సినిమాను మరోస్థాయికి తీసుకెళ్లడం ఖాయమని సినీపండితులు అభిప్రాయపడుతున్నారు. ప్రశాంత్‌వర్మ సినిమాలంటే ఫాంటసీ, మైథలాజికల్ అంశాల మేళవింపుగా ఉంటాయి. మరి యశ్ కోసం ఆయన ఏ తరహా కథను తయారు చేశారో చూడాలి. ప్రస్తుతం వీరిద్దరి మధ్య కథాచర్చలు ప్రాథమిక దశలో ఉన్నాయట.