ప్రముఖ హాస్య నటుడు అలీ సోదరుడి కుమారుడు సదన్ హీరోగా పరిచయమవుతున్న చిత్రం ‘ప్రణయ గోదారి’. పీఎల్ విఘ్నేష్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని పీఎల్‌వి క్రియేషన్స్ పతాకంపై పారమళ్ల లింగయ్య నిర్మిస్తున్నారు. ప్రియాంక ప్రసాద్ కథానాయిక. ఈ చిత్ర టైటిల్ ఫస్ట్‌లుక్‌ను అంబర్‌పేట శంకర్ విడుదల చేశారు. ఈ సందర్భంగా దర్శకుడు పీఎల్ విఘ్నేష్ మాట్లాడుతూ ‘సున్నితమైన భావోద్వేగాలతో సాగే హృద్యమైన ప్రేమకథా చిత్రమిది. ప్రేమ ప్రయాణంలోని మధుర భావాలకు అద్దం పడుతుంది. యువతతో పాటు ఫ్యామిలీ ఆడియెన్స్‌ను కూడా ఆకట్టుకుంటుంది. త్వరలో విడుదల చేయబోతున్నాం’ అన్నారు. సాయికుమార్, పృథ్వీ, జబర్దస్త్ రాజమౌళి తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి కెమెరా: ఈదర ప్రసాద్, సంగీతం: మార్కండేయ, దర్శకత్వం: పీఎల్ విఘ్నేష్.