‘మా’ (మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్) ఎన్నికలు (Maa Elections) దగ్గర పడుతున్న కొద్దీ సర్వత్రా ఉత్కంఠ పెరిగిపోతుంది. ఇప్పటికే పోటీలో నుంచి బండ్ల గణేశ్ తప్పుకుంటూ తన మద్దతు ప్రకాశ్ రాజ్ (Prakash Raj) అనే ప్రకటించారు. మరోవైపు సీవీఎల్ నరసింహారావు కూడా ఎన్నికల బరిలో నుంచి తప్పుకున్నారు. దీంతో ఇక తాజా ఎన్నికల్లో ప్రధానంగా ప్రకాశ్ రాజ్, మంచు విష్ణు (Manchu Vishnu)మధ్యే పోటీ నెలకొంది. ఎక్కువ మంది మద్దతు తమకే ఉందని, గెలుపు తమదంటే తమదని ఈ రెండు ప్యానెళ్లు ధీమాగా చెప్తున్నాయి. అక్టోబర్ 10న ఎన్నికల నేపథ్యంలో తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వూలో పలు విషయాలు చెప్పుకొచ్చారు ప్రకాశ్ రాజ్. ప్రకాశ్ రాజ్ లాంటి బిజీ ఆర్టిస్ట్. ఆయన చాలా సినిమాలు చేస్తుంటారు. జాతీయ రాజకీయాల్లో చురుకుగా ఉంటారు. కొన్ని గ్రామాలు కూడా దత్తత తీసుకున్నారు. ఇంత బిజీగా ఉన్న ఆర్టిస్ట్ మా అసోసియేషన్ లో ఉన్న సమస్యలపై ఫోకస్ చేయగలరా..? అని ప్రతిపక్ష ప్యానెల్ వేస్తున్న ప్రశ్నలకు ప్రకాశ్
‘మా’ ఎన్నికల్లో పోటీ చేస్తున్నానంటే తాను కొన్ని కోల్పోవాల్సి వస్తుందని ముందే అనుకున్నానని ప్రకాశ్ రాజ్ అన్నారు. నటనతోపాటు ఇతర అంశాల్లో ఎలాంటి బాధ్యత తీసుకుంటానో.. అలాగే వ్యక్తిగత విషయాలు పక్కనపెట్టి ఒక బాధ్యతగా తీసుకుని మా ఎన్నికల్లో పోటీ చేస్తున్నట్టు చెప్పారు.
మాది సెల్ఫీలు తీసుకునే ప్యానెల్ కాదు..
‘మా’ భవనంతో సభ్యులందరికీ ఉపయోగం ఉండాలనేదే తమ విజన్ అని చెప్పారు. ‘మా’ కోసం ఇతరులపై ఆధారపడటం కాకుండా మాకు నిరంతరం ఆదాయం వచ్చేలా ఏర్పాటు చేయాల్సిన అవసరముందన్నారు. మా సభ్యుల సంక్షేమం కోసం ఇపుడు కనీసం రూ.10 కోట్లు కావాలి. మా ప్యానెల్ సభ్యులు తప్పుగా మాట్లాడినా ఖండిస్తాను. నన్ను అవమానించినపుడు కూడా మౌనంగా ఉండకూడదు కదా..? మా మసక బారడానికి గతంలో గెలిచిన సభ్యులే కారణం. వ్యక్తిగత ఈగోలకన్నా మా సంక్షేమమే తమకు ముఖ్యమని, తమను ఛాలెంజ్ చేసినపుడు స్పందిచకపోతే ఎలా..? అని ప్రశ్నించారు.
నేను ‘మా’ ఎన్నికల్లో పోటీ చేస్తే ఇంత ఫ్రస్టేట్ అవుతారని నాకు తెలియదు. మా సమస్యలు, వాటి పరిష్కారాలు, మీ విజన్ గురించి మాట్లాడాలని ప్రతిపక్ష ప్యానెల్ సభ్యులకు సూచించారు వ్యక్తిగత దూషణలకు ఎందుకు ప్రాధాన్యత ఇస్తున్నారని ప్రశ్నించారు. ఇప్పటివరకు చాలా మంది హామీలు ఇచ్చారు..కానీ అమలు చేయలేదు. మాది సెల్ఫీలు తీసుకునే ప్యానెల్ కాదని, పెద్ద పెద్ద హీరోల పేర్లు వాడుకునే ప్యానెల్ కాదని స్పష్టం చేశారు ప్రకాశ్‌రాజ్.
Manoj Bajpayee: మరో విషాదం.. మనోజ్ బాజ్‌పేయ్ తండ్రి మృతి
Mahesh: స్పెయిన్ షెడ్యూల్ ప్లాన్ చేసిన సర్కారు వారి పాట టీం..!
Chiranjeevi | గర్వంగా చెబుతున్నా అది నా సొంత డబ్బు: చిరంజీవి