ఎప్పటి నుండో ఎదురు చూస్తున్న రోజు రానే వచ్చింది.మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికలు మరి కొద్ది నిమిషాలలో ప్రారంభం కానున్నాయి. అధ్యక్షబరిలో నిలిచిన ప్రకాశ్ రాజ్,మంచు విష్ణులలో ఎవరు గెలుస్తారా అనే ఆసక్తి నెలకొని ఉంది.అయితే మా ఎన్నికల నేపథ్యంలో కొద్ది రోజులుగా ప్రకాశ్ రాజ్,మంచు విష్ణు ఒకరిపై ఒకరు దారుణమైన విమర్శలు చేసుకున్నారు. ఎన్నికల తర్వాత వారు మొహం చూసుకుంటారా అనేలా తిట్టుకున్నారు.
కట్ చేస్తే మా ఎలక్షన్స్‌కి కొద్ది సేపటి ముందు ప్రకాశ్ రాజ్, మంచు విష్ణు కలిసారు. మోహన్ బాబు.. ఈ ఇద్దరి చేతులని కలిపారు. అనంతరం మంచు విష్ణు- ప్రకాశ్ రాజ్ హగ్ చేసుకున్నారు. ఈ సన్నివేశాలు చూస్తుంటే చాలా మంది ఇది రియల్ లైఫా లేకుంటే రీల్ లైఫా అనే అనుమానం కలిగింది. ఒకరిపై ఒకరు అవాకులు చెవాకులు పేల్చుకున్న వీరు ఇప్పుడు ఇలా కలిసి పోవడం మంచి శుభపరిణామమే అంటున్నారు.