Prakash Raj | ‘ధురంధర్ 2’ ప్రశంసల వెనుక ఒత్తిడి రాజకీయాలు?.. టాలీవుడ్ నటులపై ప్రకాష్ రాజ్ సంచలన వ్యాఖ్యలు!
Prakash raj Comments on Dhurandhar 2 | రణ్వీర్ సింగ్ కథానాయకుడిగా, ఆదిత్య ధార్ దర్శకత్వంలో వచ్చిన 'ధురంధర్ 2' (Dhurandhar: The Revenge) చిత్రం బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపిస్తున్న విషయం తెలిసిందే.
Prakash raj Comments on Dhurandhar 2 | రణ్వీర్ సింగ్ కథానాయకుడిగా, ఆదిత్య ధార్ దర్శకత్వంలో వచ్చిన ‘ధురంధర్ 2’ (Dhurandhar: The Revenge) చిత్రం బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపిస్తున్న విషయం తెలిసిందే. మొదటి భాగం సృష్టించిన ఇంపాక్ట్‌తో, సీక్వెల్ కోసం ప్రేక్షకులు థియేటర్ల వద్ద బారులు తీరుతున్నారు. కేవలం ఓపెనింగ్ డే రోజే ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా భారీ వసూళ్లను రాబట్టి, ట్రేడ్ వర్గాలను సైతం ఆశ్చర్యపరిచింది. అయితే ఈ సినిమాకు ఒకవైపు భారీ రెస్పాన్స్ వస్తుంటే, మరోవైపు ఇది రాజకీయ ప్రచార చిత్రం (Propaganda Film) అనే విమర్శలు కూడా బలంగా వినిపిస్తున్నాయి. ఈ క్రమంలోనే టాలీవుడ్ టాప్ హీరోలు అల్లు అర్జున్, మహేష్ బాబు, జూనియర్ ఎన్టీఆర్, మరియు విజయ్ దేవరకొండ ఈ చిత్రాన్ని ప్రశంసిస్తూ ఎక్స్ వేదికగా పోస్ట్‌లు పెట్టడం ప్రాధాన్యత సంతరించుకుంది.
అయితే ఈ సినిమాపై వస్తున్న ప్రశంసలు వెనుక రాజకీయ ఒత్తిళ్లు ఉన్నాయని విమర్శలు వస్తున్నాయి. అయితే ఇదే విషయంపై ప్రముఖ నటుడు ప్రకాశ్ రాజ్ ఎక్స్ వేదికగా స్పందించాడు. ఉత్తరాదిలో తరచుగా వినిపించే “ఒత్తిడి రాజకీయాలు” ఇప్పుడు టాలీవుడ్లోకి కూడా ప్రవేశించాయని, అధికార పార్టీకి అనుకూలంగా ఉండే సినిమాలను ప్రమోట్ చేయాల్సిన పరిస్థితి స్టార్ హీరోలకు వచ్చిందని ఆయన పరోక్షంగా బీజేపీని ఉద్దేశించి విమర్శలు గుప్పించారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Elimination | బిగ్‌బాస్ తెలుగు 10లో షాకింగ్ ఎలిమినేషన్.. హౌస్ నుంచి అపూర్వ అవుట్, తర్వాత శాలిని వంతేనా?
Srisailam | నేటి నుంచి శ్రీశైలంలో దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలు
Hyderabad | ఆరేళ్ల పాప మిస్సింగ్ కేసు విషాదాంతం.. చంపేసి, సెల్లార్లో పడేసిన సెక్యూరిటీ గార్డు!
Dasturabad | బీఆర్ఎస్ హయాంలో మండలం.. పదేళ్లలో మారిన ‘దస్తురాబాద్’ రూపురేఖలు..!
Bhatti Vikramarka | డిప్యూటీ సీఎం ఇలాకాలో కాంగ్రెస్‌కు షాక్.. సర్పంచ్ ఫాతిమాభి రాజీనామా!
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

