Prakash Raj | ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌పై మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశాడు నటుడు ప్రకాశ్ రాజ్. పవన్ కళ్యాణ్ మూర్ఖంగా రాజకీయాలు చేస్తున్నాడు అంటూ మండిపడ్డాడు. తిరుమల లడ్డూ విషయంలో ప్రజలను మతపరంగా పవన్ కళ్యాణ్ రెచ్చగొడుతున్నడంటూ ప్రకాశ్ రాజ్ స్పందించిన విషయం తెలిసిందే. దీంతో వీరిద్దరి మధ్య కొన్నిరోజులు మాటల యుద్ధం నడిచింది. ఇప్పుడు తాజాగా మరోసారి పవన్‌పై ప్రకాశ్ రాజ్ విరుచుకుపడ్డాడు.
పవన్ కళ్యాణ్ అంటే మీకు ఎందుకు అంతా కోపం అని రిపోర్టర్ అడిగిన ప్రశ్నకు సమాధానమిస్తూ.. పవన్ కళ్యాణ్ మూర్ఖంగా రాజకీయాలు చేస్తున్నాడు. విధ్వంస రాజకీయాలు చేస్తున్నాడు అది నాకు నచ్చట్లే అదే చెబుతున్నాను. ప్రజలు అతడిని ఎన్నుకున్నది మతపరంగా విడదీసి విధ్వంస రాజకీయాలు చేయడానికి కాదు కదా. వీటిని ప్రశ్నించేవారు ఒకరు ఉండాలి కదా. అదే నేను చేస్తున్నాను. సింపుల్‌గా చెప్పాలి అంటే ఆయోధ్యలో ఓడిపోయారు. మన ఊరు కొండ ఎక్కడానికి వచ్చారు మనం చూసుకోవాలి అంతే.