Pawan Kalyan | ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ (Pawan Kalyan)ను ఉద్దేశించి సంచలన వ్యాఖ్యలు చేశాడు నటుడు ప్రకాశ్‌రాజ్. ఇప్పటికే చాలాసార్లు పవన్‌పై ఆరోపణలు చేసిన ప్రకాశ్ రాజ్ తాజాగా మరోసారి పవన్ కల్యాణ్ గురించి మాట్లాడారు.
రీసెంట్గా ఒక ఇంటర్వ్యూలో పాల్గోన్న ఆయన మాట్లాడుతూ.. పవన్‌కి ఒక విజన్ అంటూ లేదని తెలిపాడు. ఎన్నికల ముందు ప్రజా సమస్యల గురించి మాట్లాడిని పవన్ ఇప్పుడేమో సనాతన రక్షకుడినంటూ మతం రంగు పూసుకున్నాడంటూ తెలిపాడు. అధికారంలో ఉంటూ ప్రజల సమస్యలను పరిష్కరించకుండా సమయాన్ని ఎందుకు వృథా చేస్తున్నారని ప్రశ్నించారు. ప్రస్తుతం ఉన్న యువత నిరుద్యోగంతో బాధపడుతున్నారు. రోడ్లు బాగాలేవు. అవినీతి పెరిగిపోయింది వీటి గురించి పట్టించుకోవడం వదిలేసి సనాతన్ రక్షక్ అంటే ఎవడికి ఉపయోగం అంటూ ప్రకాశ్ రాజ్ అన్నారు.
అలాగే తిరుపతి లడ్డూ వివాదంపై కూడా స్పందిస్తూ, తాను సనాతన ధర్మానికి వ్యతిరేకం కాదని చెప్పారు. అది చాలా సున్నితమైన విషయమని, భక్తుల మనోభావాలతో ముడిపడి ఉంటుంది కాబట్టి, ఇలాంటి అంశాల గురించి మాట్లాడేటప్పుడు సరైన ఆధారాలతో జాగ్రత్తగా మాట్లాడాలని అన్నారు. కానీ పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం హోదాలో ఉండి ప్రజలను రెచ్చగొట్టడం.. లడ్డూకి మతరంగులు పూసి ముస్లింలను విలన్లుగా చిత్రీకరించడం చేశాడంటూ ప్రకాశ్ రాజ్ తెలిపారు. ఒకవేళ లడ్డూ తయారీలో నిజంగా కల్తీ జరిగి ఉంటే, బాధ్యులపై తక్షణమే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.