Prakash Raj – Pawan Kalyan | దిగ్గజ నటుడు ప్రకాశ్ రాజ్ మంచు విష్ణుకి గట్టి కౌంటర్ ఇచ్చాడు. తిరుమల లడ్డూ వివాదంలో పవన్ కళ్యాణ్‌ను సపోర్ట్ చేసిన విష్ణుకి శివయ్య అంటూ దిమ్మదిరిగే కౌంటర్ ఇచ్చాడు. తిరుమల లడ్డూ వివాదంపై ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సంచలన వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. తిరుమల లడ్డూలో జంతువుల కొవ్వు నూనెలు వినియోగించడం అనేది భక్తుల మనోభావాలను దెబ్బతీశాయని.. ఆలయాల్లో జరిగే అంశాల పర్యవేక్షణకు జాతీయస్థాయిలో సనాతన ధర్మరక్షణ బోర్డు ఏర్పాటు చేయాల్సిన సమయం వచ్చిందని పవన్ అభిప్రాయపడ్డారు. అయితే ఈ వ్యాఖ్యలపై ప్రకాశ్ రాజ్ కూడా ఎక్స్ వేదికగా పవన్‌కు గట్టి కౌంటర్ ఇచ్చాడు.
డియర్ పవన్ కళ్యాణ్ గారు. తిరుమల లడ్డూ వివాదం ప్రస్తుతం మీరు డిప్యూటీ సీఎంగా ఉన్న రాష్ట్రంలోనే జరిగింది. దయచేసి దీనిపై విచారణ జరపండి. తప్పు చేసిన వాళ్ళు ఎవరో కనిపెట్టి వాళ్ళని కఠినంగా శిక్షించండి. అది వదిలేసి మీరు ప్రజల్లో భయం పెంచుతూ దీన్ని జాతీయ స్థాయి సమస్యగా చూపించడానికి ఎందుకు ప్రయత్నిస్తున్నారు. మన దేశంలో ఇప్పటికే సరిపడా మతపరమైన ఉద్రిక్తతలు ఉన్నాయి (సెంట్రల్ గవర్నమెంట్ నడుపుతున్న మీ మిత్రుల వల్ల) అందుకే ఇలాంటివి మానుకోండి.” అంటూ ప్రకాశ్ రాజ్ రాసుకోచ్చాడు.
అయితే ఈ పోస్ట్‌పై మా అసోసియేషన్ ప్రెసిడెంట్, నటుడు మంచు విష్ణు ఎక్స్‌లో స్పందిస్తూ.. డియర్ పవన్ ప్రకాశ్ రాజ్ గారు. దయచేసి సైలెంట్‌గా ఉండండి. తిరుమల లడ్డూ కేవలం ప్రసాదం మాత్రమే కాదు, నాలాంటి లక్షలాది మంది హిందువుల విశ్వాసానికి ప్రతీక. అటువంటి పవిత్రమైన సంప్రదాయాల పరిరక్షణకు సమగ్ర విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు సరిగ్గానే పిలుపునిచ్చారు. మీరు దాని వద్ద ఉన్నప్పుడు, అసలు మతపరమైన రంగు ఎక్కడ జోడించబడుతుందో ఆలోచించండి. మీ హద్దులో మీరు ఉండండి అంటూ మంచు విష్ణు రాసుకోచ్చాడు.
తాజాగా దీనికి ప్రకాశ్ రాజ్ స్పందిస్తూ.. ఒకే శివయ్యా .. నాకు నేను మాట్లాడే విషయాలపై అవగాహన ఉంది. మీకు మీ అభిప్రాయం ఉంది అంటూ కామెడీ ఎమోజీలను జత చేశాడు.
మంచు విష్ణు నటిస్తున్న తాజా చిత్రం కన్నప్ప. ఈ సినిమాలోని టీజర్లో మంచు విష్ణు శివయ్యా అంటూ ఒక డైలాగ్ చెప్పిన విషయం తెలిసిందే. ఆ డైలాగ్ వలన మంచు విష్ణు సోషల్ మీడియాలో తెగ ట్రోల్ అవుతున్నాడు. తాజాగా ఇదే డైలాగ్‌ను రిపీట్ చేశాడు ప్రకాశ్ రాజ్.
😂😂😂😂 Ok sivayyyyyaaaaa .. i have my perception .. you have yours … Noted #justasking https://t.co/MmGUiXv5mN
— Prakash Raj (@prakashraaj) September 21, 2024
Sri @prakashraaj , please clam the heck down. The Tirumala Laddu is not just prasadam, it’s a symbol of faith for millions of Hindus like me. Sri @PawanKalyan, the Deputy CM, has rightly called for thorough investigation and action to ensure the protection of such sacred… https://t.co/K2SSZUuIJe
— Vishnu Manchu (@iVishnuManchu) September 21, 2024
Dear @PawanKalyan …It has happened in a state where you are a DCM .. Please Investigate ..Find out the Culprits and take stringent action. Why are you spreading apprehensions and blowing up the issue Nationally … We have enough Communal tensions in the Country. (Thanks to your… https://t.co/SasAjeQV4l
— Prakash Raj (@prakashraaj) September 20, 2024