కన్నడ హీరో ప్రజ్వల్ దేవరాజ్ నటించిన తాజా చిత్రం ‘రాక్షస’. లోహిత్ హెచ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని కన్నడ, తెలుగు భాషల్లో మార్చి 7న విడుదల చేయబోతున్నారు. నిర్మాత ఎంవీఆర్ కృష్ణ ఈ సినిమా తెలుగు హక్కులను దక్కించుకున్నారు. ఈ నెల 28న విడుదల కావాల్సిన ఈ చిత్రాన్ని అనివార్య కారణాల వల్ల వారం రోజుల పాటు వాయిదా వేశామని మేకర్స్ తెలిపారు.
ఇప్పటికే విడుదలైన ప్రచార చిత్రాలకు అద్భుతమైన స్పందన లభించిందని, తండ్రీకూతుళ్ల అనుబంధం నేపథ్యంలో ఈ సినిమా ఆకట్టుకుంటుందని నిర్మాత ఎంవీఆర్ కృష్ణ పేర్కొన్నారు. అరుణ్రాథోడ్, శ్రీధర్, గౌతమ్, సోమశేఖర్ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి అజనీష్ లోక్నాథ్ సంగీతాన్నందించారు.