Pragathi Rishab Shetty | కన్నడ నటుడు రిషబ్ శెట్టి స్వీయ దర్శకత్వంలో వచ్చిన కాంతార చాఫ్టర్ 1 చిత్రం బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతున్న విషయం తెలిసిందే. కాంతార సినిమాకు ప్రీక్వెల్‌గా వచ్చిన ఈ చిత్రం దసరా కానుకగా విడుదలై కేవలం ఐదు రోజుల్లోనే రూ.300 కోట్లకు పైగా వసూళ్లను రాబట్టింది. అయితే ఈ సినిమా ఇంతటి విజయం సాధించడం వెనుక రిషబ్ శెట్టి కృషితో పాటు అతడి భార్య ప్రగతి శెట్టి కృషి కూడా ఎంతో ఉంది. ప్రగతి శెట్టి ‘కాంతార’ సినిమాతో పాటు కాంతర చాఫ్టర్1కి కూడా కాస్ట్యూమ్ డిజైనర్‌గా పనిచేశారు. సినిమాలో కనిపించే ప్రతి పాత్ర దుస్తులు, ముఖ్యంగా పారలౌకిక పాత్రల వస్త్రధారణ, అక్కడి సంస్కృతికి అద్దం పట్టేలా తీర్చిదిద్దడంలో ఆమె కీలక పాత్ర పోషించారు. ఈ పనిలో ఆమె ఎంతో పరిశోధన, శ్రమ పెట్టారు. అయితే ఈ సినిమా విజయం సాధించిన అనంతరం తాజాగా కాంతార సెట్స్‌లోని ఫొటోలను పంచుకుంది. ఇందులో నటుడు రిషబ్ శెట్టితో పాటు విలన్‌గా నటించిన గుల్షన్ దేవయ్య, నటి రుక్మిణి వసంత్‌లకు కాస్ట్యూమ్స్ సెలక్ట్ చేసిన ఫొటోలను ప్రగతి పంచుకుంది. కాగా ఇందుకు సంబంధించిన ఫొటోలు వైరల్‌గా మారాయి.

Kanatara

Kantarachapter

Pragathi

Pragathi Rishab

Pragathi Rishab 1

Rishab Shetty

Rishab Shetty