Pradeep | బుల్లితెర యాంకర్ ప్రదీప్ గురించి ప్రత్యేక పరిచయాలు అక్కర్లేదు. పంచులు, ప్రాసలు, జోకులతో పలు టీవీ షోలను సక్సెస్ ఫుల్ గా రన్ చేసిన అతను పలు సినిమాలలో క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా కూడా పని చేశారు. ఇక ఆ తర్వాత హీరోగా మారాడు. 30 రోజుల్లో ప్రేమించడం ఎలా సినిమాతో హీరోగానూ మారిన ప్రదీప్ ఈ సినిమాతో మంచి హిట్ అందుకోలేకపోయాడు. ఇందులోని పాటలు సూపర్ హిట్ గా నిలిచినా మూవీ మాత్రం ఆ రేంజ్ లో మెప్పించలేకపోయింది. ఇప్పుడు ప్రదీప్ మరో సినిమాతో ప్రేక్షకులని పలకరించేందుకు సిద్ధమయ్యాడు. గత కొద్ది రోజులుగా షోస్‌కి కూడా దూరంగా ఉంటూ అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి అనే సినిమా కోసం పని చేస్తున్నారు.
ఈ మూవీ ఏప్రిల్ 11న రిలీజ్ కానుంది. ప్రస్తుతం మూవీ యూనిట్ ప్రమోషన్స్ తో బిజీగా ఉంది. తాజాగా ట్రైలర్ కూడా రిలీజ్ చేశారు. ఇది ఆసక్తికరంగా ఉంది.ఇక ప్రదీప్ చిత్ర ప్రమోషన్లో భాగంగా పలు ఇంటర్వ్యూలకి హాజరై ఆసక్తికర విషయాలు తెలియజేస్తున్నారు. అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి సినిమాకి ఒక్క రూపాయి కూడా రెమ్యునరేషన్ తీసుకోలేదు. ఈ సినిమాకు నా చిన్నప్పటి ఫ్రెండ్స్ నలుగురు నిర్మాతలుగా మారారు. వారితో పాటు నేను కూడా కొంత డబ్బు పెట్టాను. అందుకే రెమ్యునరేషన్ తీసుకోలేదు. సినిమా రిలీజ్ అయి మంచి ప్రాఫిట్స్ వస్తే అందులో ఎంతో కొంత తీసుకుంటాను. గత రెండేళ్లుగా షోలు కూడా రెగ్యులర్ గా చెయ్యట్లేదు కాబట్టి ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ వచ్చాయి.
అయితే అవన్నీ మేనేజ్ చేసాను. ఇప్పుడు మాత్రం ప్రదీప్ ఆశలు అన్ని కూడా అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి సినిమాపైనే ఉన్నాయి. మరి ఈ సినిమా తర్వాత అయిన ప్రదీప్ షోస్ చేస్తాడా లేదంటే మరో సినిమా మొదలు పెడతాడా అనేది చూడాలి. ‘పవన్ కళ్యాణ్ నటించిన ‘అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి’ సినిమా టైటిల్ ను తన మూవీకి పెట్టడంపై స్పందించిన ప్రదీప్.. ఆ సినిమాకి నా సినిమాకి సంబంధమే ఉండదు అని అన్నాడు. ఫస్ట్ స్టోరీ చెప్పినప్పుడే మూవీకి ఈ టైటిల్ అని చెప్పారు. కథకి సరిగ్గా సరిపోయే టైటిల్ ఇది. పవన్ మూవీ పేరు కాబట్టి కాస్త భయం కూడా ఉంది. ఆ పేరు చెడగొట్టకుండా జాగ్రత్తగా తీసాం. పవన్ ఫ్యాన్స్ కి కూడా ఈ సినిమా నచ్చుతుంది అని ప్రదీప్ పేర్కొన్నారు.