Mamitha Baiju | తమిళ యంగ్ హీరో, దర్శకుడు ప్రదీప్ రంగనాథన్ (Pradeep Ranganathan) తన సహనటి మమితా బైజు (Mamitha Baiju) జుట్టు పట్టుకుని లాగాడు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది. ‘ప్రేమలు’ ఫేమ్ మమితా బైజు హీరోయిన్గా ప్రదీప్ హీరోగా నటించిన తాజా చిత్రం ‘డ్యూడ్’ (Dude). తమిళంతో పాటు తెలుగులో ఈ చిత్రం అక్టోబర్ 17న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ సందర్భంగా తెలుగులో ప్రీ రిలీజ్ వేడుకను ఏర్పాటు చేశారు మేకర్స్. అయితే ఈ వేడుకలో యాంకర్ ఫన్నీ టాస్క్ ఇవ్వగా.. ప్రదీప్ రంగనాథన్ తన సహనటి మమితా బైజు జుట్టును పట్టుకుని కొద్ది దూరం లాగాడు. దీంతో ఈ వీడియో వైరల్‌గా మారింది. అయితే ఈ వీడియోపై కొందరూ నెటిజన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తుండగా.. మరికొందరూ ప్రదీప్‌కి మద్దతుగా నిలుస్తున్నారు. మమితా బైజుకి లేని ఇబ్బంది మీకు ఎందుకు అంటూ పలువురు కామెంట్లు పెడుతున్నారు.