Prabhu Dheva And Vadivelu New Film | 90వ దశకంలో తమ కామెడీ టైమింగ్‌తో ప్రేక్షకులను ఉర్రూతలూగించిన ప్రభుదేవా, వడివేలు కాంబినేషన్ మళ్ళీ తెరపైకి రాబోతోంది. ఈ హిట్ జోడి కలిసి ఓ కొత్త సినిమా చేయనున్నట్లు అధికారికంగా ప్రకటించారు మేకర్స్. వీరిద్దరూ కలిసి శంకర్ దర్శకత్వంలో వచ్చిన కాదలన్ (1994) చిత్రంలో నటించి బ్లాక్ బస్టర్ అందుకున్నారు. ఆ తర్వాత లవ్ బర్డ్స్ (1995), మిస్టర్ రోమియో (1996), కాదలా కాదలా (1998), మనదై తిరుడివిట్టై (2001) చిత్రాల్లో కలిసి నటించారు. చివరిగా వీరిద్దరూ కలిసి నటించిన చిత్రం ఎంగల్ అన్నా (2004). ఈ సినిమా తర్వాత మళ్లీ కనిపించలేదు. అయితే చాలా ఏండ్ల తర్వాత ప్రభుదేవా, వడివేలు కలిసి నటించబోతున్నారు. ప్రోడక్షన్ 4 అంటూ రాబోతున్న ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించి మోషన్ పోస్టర్‌ను మేకర్స్ తాజాగా విడుదల చేశారు. ఈ పోస్టర్లో ఇద్దరు కౌబాయ్ దుస్తుల్లో కనిపిస్తుండగా.. Why Blood Same Blood అనే ట్యాగ్‌లైన్ ఉంది. ఈ డైలాగ్ 2001లో వచ్చిన “మనదై తిరుడివిట్టై” చిత్రంలోని ఫేమస్ డైలాగ్ అవ్వడంతో చిత్రంపై మంచి అంచనాలు నెలకొన్నాయి.
ఇంకా టైటిల్ ఖరారు చేయని ఈ ప్రాజెక్ట్‌కు సామ్ రోడ్రిగ్స్ రచన, దర్శకత్వం వహిస్తున్నారు. కన్నన్ రవి నిర్మిస్తున్న ఈ చిత్రానికి యువన్ శంకర్ రాజా సంగీతం అందిస్తున్నారు. విఘ్నేష్ వాసు సినిమాటోగ్రఫీ, ఆంటోనీ ఎడిటింగ్, పీటర్ హెయిన్ స్టంట్స్ అందిస్తున్నారు. ఈ చిత్రం 2026లో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నట్లు చిత్రబృందం ప్రకటించింది.
Prabhudeva & Vadivelu joining together for a Film🎬🔥 pic.twitter.com/cDWOoJKXaw
— AmuthaBharathi (@CinemaWithAB) July 15, 2025