Premikudu | సరిగ్గా ముప్ఫై ఏళ్ల క్రితం విడుదలైన శంకర్ ‘ప్రేమికుడు’ తెలుగునాట ఎంతటి విజయాన్ని సాధించిందో తెలిసిందే. ఆ సినిమాకూ, అందులోని ఏ.ఆర్.రెహమాన్ పాటలకూ ఇప్పటికీ అభిమానులున్నారు. ప్రభుదేవ డాన్సులు, నగ్మ అందచందాలు ఈ సినిమాను మరోస్థాయిలో నిలబెట్టాయి.
నిర్మాత కేటీ కుంజుమన్ భారీ వ్యయంతో నిర్మించిన ఈ చిత్రం ఇప్పుడు రీ-రిలీజ్ కానుంది. రమణ, మురళీధర్ కలిసి ఈ చిత్రాన్ని ఈనెల 13న థియేటర్లలో విడుదల చేస్తున్నారు. ఎస్పీబాలసుబ్రహ్మణ్యం, గిరీశ్కర్నాడ్, రఘువరన్, వడివేలు ఇందులో కీలక పాత్రలు పోషించిన విషయం తెలిసిందే.