Adipurush Movie Trailer | ఎప్పుడెప్పుడా అని ప్రభాస్ అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్న ఆదిపురుష్ ట్రైలర్ మరో ఇరవై నాలుగు గంటల్లో రిలీజ్ కాబోతుంది. టీజర్‌తో తీవ్రంగా ట్రోల్స్‌కు గురైన మేకర్స్ ట్రైలర్‌తో ఆకట్టుకుంటారా? అనే ప్రశ్న కూడా చాలా మంది మదిలో ఉంది. గత రెండు, మూడు వారాల నుంచి ఆదిపురుష్ సినిమాకు పాజిటీవ్ వైబ్స్ కనిపిస్తున్నాయి. రామనవమి పోస్టర్ నుంచి, హనుమంతుడి పోస్టర్, జై శ్రీరామ్ పాట, ప్రభాస్ పోస్టర్లు ఇలా ప్రతీది తెగ ఆకట్టుకుంటుంది. ఇక ట్రైలర్ కూడా ప్రేక్షకులను ఆకట్టుకోగలిగితే తొలిరోజు వంద కోట్ల బొమ్మ ఖాయమని సినీ పండితులు చెబుతున్నారు.
ఇక మంగళవారం ఈ సినిమా ట్రైలర్ రిలీజ్ కానుంది. కాగా సోమవారం ఏఎమ్‌బీ థియేటర్లలో ఫ్యాన్స్ కోసం ట్రైలర్‌ను స్క్రీనింగ్ చేయబోతున్నారు. ఇందుకోసం ప్రభాస్ ఏఎమ్‌బీ మాల్‌కు రానున్నాడు. ఇక ఇప్పటికే ఓం రౌత్, కృతిసనన్ హైదరాబాద్‌కు బయలుదేరి పోయారు. కాగా సోమవారం సాయంత్రం 4గంటల 20 నిమిషాలకు ఆదిపురుష్ ట్రైలర్ స్క్రీనింగ్ కానున్నట్లు తెలుస్తుంది. ఇప్పటికే ప్రభాస్ ఫ్యాన్స్ ఏఎమ్‌బీ మాల్‌కు చేరుకున్నారు. ఇక మంగళవారం మీడియాతో మేకర్స్ ఇంట్రాక్ట్ కానున్నారు. మంగళవారం జరిగే ప్రెస్‌మీట్‌కు ఆదిపురుష్ ప్రొడక్షన్ యూనిట్ కూడా వస్తుంది.
రామయణం ఇతిహాసం నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమాకు ఓం రౌత్ దర్శకత్వం వహించాడు. ప్రభాస్ రాముడి పాత్ర పోషించగా.. కృతిసనన్ సీత పాత్రలో కనిపించనుంది. టీ సిరీస్, రెట్రో ఫైల్స్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్ సైఫ్ అలీఖాన్ రావణాసురుడి పాత్ర పోషిస్తున్నాడు. ఈ సినిమా జూన్ 16న గ్రాండ్‌గా రిలీజ్ కానుంది. ఇక ఈ సినిమా రిలీజ్‌కు మూడు రోజుల ముందే న్యూయార్క్‌లో జరిగే ట్రిబెకా ఫిల్మ్ ఫెస్టివల్లో మూడు రోజుల పాటు ఆదిపురుష్ మూవీ ప్రదిర్శితం కానుంది. కాగా ఇప్పటికే మూడు రోజులకు సంబంధించిన టిక్కెట్లు అమ్ముడుపోయాయని సమాచారం.