Prabhas Village In Nepal | రెబల్‌స్టార్ ప్రభాస్ పాపులారిటీ ప్రస్తుతం వరల్డ్ వైడ్‌గా పాకిన విషయం తెలిసిందే. బాహుబలి, సాహో, సలార్ వంటి చిత్రాలతో గ్లోబల్ స్టార్‌గా గుర్తింపు తెచ్చుకున్నాడు. అయితే రెబల్ స్టార్ ప్రభాస్ పేరిటా ఒక గ్రామం ఉందన్న విషయం ప్రస్తుతం ఆన్లైన్లో వైరల్‌గా మారింది. అయితే ఇది ఇండియాలో కాకుండా పక్కదేశం అయిన నేపాల్‌లో ఉండడం విశేషం. ఒక తెలుగు మోటో బ్లాగర్ నేపాల్‌లో పర్యటిస్తుండగా.. ఒక ఊరి పేరు ప్రభాస్ అని రాసి ఉంది. దీంతో అతడు ఈ విషయాన్ని వీడియో తీసి ఆన్లైన్లో పెట్టాడు. నేను నేపాల్‌లో ప్రభాస్ అనే ఊరిలో ఉన్నాను. మన తెలుగు వారికి ప్రభాస్ అనే పేరు వినగానే ఒక వైబ్ వస్తుంది. మీరు ఎప్పుడయిన ప్రభాస్ అనే పేరుపై ఉన్న విలేజ్‌ని చూశారా అంటూ చెప్పుకోచ్చాడు.
అయితే ఈ గ్రామానికి ‘ప్రభాస్’ అని పేరు ఎందుకు వచ్చింది, దాని వెనుక కథ ఏమిటన్నది స్పష్టంగా తెలియదు. అయితే, ఈ విషయం ప్రభాస్ అభిమానులను ఎంతగానో ఆనందపరిచింది. తమ హీరో పేరు ఒక ఊరికి ఉండడం చూసి వారు సంతోషంగా ఫీలవుతున్నారు. ఇది నేపాల్‌లోని ఒక చిన్న పట్టణం మాత్రమే అయినప్పటికీ, ఈ వార్త ప్రభాస్ ఫ్యాన్స్‌కు గర్వకారణంగా నిలిచింది. మరోవైపు నెటిజన్లు ప్రభాస్ అనే పేరు ఆ ఊరికి ఎలా వచ్చిందని తెగ సెర్చ్ చేయడం మొదలుపెట్టారు.