Varsham Movie | పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటించిన బ్లాక్ బస్టర్ చిత్రాలలో వర్షం కూడా ఒక్కటి. ప్రభాస్ ప్రధాన పాత్రలో నటించిన ఈ చిత్రంలో త్రిష కృష్ణన్ కథానాయికగా నటించగా.. గోపీచంద్ విలన్‌గా నటించాడు. ఈ సినిమాకు శోభన్ దర్శకత్వం వహించగా.. సుమంత్ ఆర్ట్స్ బ్యానర్‌పై ఎమ్ ఎస్ రాజు ఈ సినిమాను నిర్మించాడు. 2004లో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్‌ను అందుకోవడమే కాకుండా.. ప్రభాస్‌కి మొదటి బ్లాక్ బస్టర్‌ను అందించింది. అయితే బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని అందుకున్న ఈ రొమాంటిక్ యాక్షన్ డ్రామాను మే 23, 2025న మళ్లీ రీ-రిలీజ్ చేయబోతున్నారు మేకర్స్. ఈ సినిమాను 4K రిజల్యూషన్‌తో విడుదల చేయబోతున్నట్లు ప్రకటించారు. ఈ సందర్భంగా కొత్త పోస్టర్‌ను పంచుకున్నారు.
#Varsham4K Nizam Grand Release By @SVC_official #Varsham Re-Releasing 23rd May ! pic.twitter.com/OtnnhwQBcz
— Vamsi Kaka (@vamsikaka) April 29, 2025