Varsham | డార్లింగ్ ప్రభాస్ కెరీర్ మలుపు తిప్పిన చిత్రం వర్షం. దివంగత డైరెక్టర్ శోభన్ తెరకెక్కించిన ఈ సినిమా 2004లో విడుదలై బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టించింది. అప్పట్లో ఈ మూవీ ఓ రేంజ్ వసూళ్లు రాబట్టింది. అప్పటి వరకు ఫ్లాపులతో సతమతమవుతున్న ప్రభాస్‌కి ఈ చిత్రం చాలా పెద్ద సక్సెస్ అందించింది. అంతేకాదు బాక్సాఫీస్ దగ్గర కలెక్షన్స్ సునామి సృష్టించింది. చిత్రంలో ప్రభాస్ సరసన త్రిష నటించగా, వారిద్దరి మధ్య కెమిస్ట్రీ అదిరిపోయింది. ఈ సినిమాలోని పాటలు, యాక్షన్ సన్నివేశాలు ప్రేక్షకుల్ని ఆకట్టుకున్నాయి. రూ.8 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ చిత్రం ఆ సమయంలో రూ.32 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్‌ను రాబట్టి సూపర్ హిట్‌గా నిలిచింది.
వర్షం చిత్రం విడుదలై దాదాపు 21 ఏళ్లు అవుతుంది. ఇప్పుడు ఈ సినిమాను మళ్లీ థియేటర్లలోకి తీసుకురావాలని మేకర్స్ నిర్ణయించారు. మే 23న ఈ సినిమాను 4K వెర్షన్లో విడుదల చేయనున్నట్టు ప్రకటించారు. గతంలోను ఈ చిత్రాన్ని రీరిలీజ్ చేశాడు.ఇది మూడోసారి రీరిలీజ్ కావడం విశేషం. విడుదలకు ముందే ఈ సినిమాకు మంచి స్పందన వస్తోంది. ఇప్పటికే 6,000 టికెట్లు అమ్ముడవ్వగా, కేవలం 15 షోలు మాత్రమే ప్రదర్శించనున్నట్లు సమాచారం. 4కే వెర్షన్ తో వెండితెరపైకి రానున్న ఈ చిత్రం ప్రేక్షకులకి మంచి మజా అందిస్తుందని అంటున్నారు. లవ్ స్టోరీ, కామెడీ, యాక్షన్ అన్ని అంశాలతో ఫుల్ ప్యాక్డ్ ఎంటర్టైనర్ గా వచ్చిన ఈ సినిమా టీవీలో వస్తే మిస్ కాకుండా చూసే వారు చాలా మందే ఉన్నారు.
ఇటీవల వరుస సక్సెస్‌లతో ఫుల్ జోష్‌లో ఉన్న ప్రభాస్ ప్రస్తుతం రాజాసాబ్ చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. డైరెక్టర్ మారుతి దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీపై భారీ హైప్ నెలకొంది. అలాగే డైరెక్టర్ హను రాఘవపూడి దర్శకత్వంలో ఓ ప్రాజెక్ట్ చేస్తున్నారు. ఇవే కాకుండా త్వరలోనే మరిన్ని ప్రాజెక్ట్స్ రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ చేయాలని ప్లాన్ చేసుకుంటున్నాడు. నాలుగు పదుల వయస్సు దాటిన కూడా ప్రభాస్ పెళ్లి జోలికి వెళ్లకుండా వరుస సినిమాలతో ప్రేక్షకులని అలరించే ప్రయత్నం చేస్తున్నాడు.