Rebel Saab Song | పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ప్రధాన పాత్రలో నటిస్తున్న రొమాంటిక్ హారర్–కామెడీ ఎంటర్టైనర్ ‘ది రాజా సాబ్’పై దేశవ్యాప్తంగా భారీ హైప్ నెలకొంది.సంక్రాంతి 2026 బరిలో జనవరి 9వ తేదీన విడుదల కానున్న ఈ సినిమాపై ప్రేక్షకులు, ఫ్యాన్స్, ట్రేడ్ వర్గాలలో అంచనాలు భారీగా ఉన్నాయి. ‘రెబల్ సాబ్’ పాటతో దేశం మొత్తం షేక్ అయింది. సినిమా మ్యూజిక్ ప్రమోషన్స్ ప్రారంభమయ్యాక విడుదలైన మొదటి సాంగ్ ‘రెబల్ సాబ్’ సోషల్ మీడియాలో సెన్సేషన్‌గా మారింది. ప్రత్యేకంగా హిందీ వెర్షన్ భారీ స్థాయిలో వైరల్ అవుతోంది.
యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్ రీల్స్, స్పాటిఫై లాంటివి మొత్తం ఈ పాటతో నిండిపోయాయి. ప్రభాస్ ఎనర్జిటిక్ స్క్రీన్ ప్రెజెన్స్, తమన్ ఇచ్చిన మాస్ బీట్లు, స్టెప్పులు ఇవన్నీ కలిసి ఈ సాంగ్‌ను దేశవ్యాప్తంగా సూపర్ హిట్ చేశాయి. ఈ పాటకు ఇప్పటికే డజన్ల కొద్దీ కవర్ వెర్షన్లు, డాన్స్ వీడియోలు వస్తుండటంతో సాంగ్ మరింత ట్రెండ్ అవుతుంది. ‘ది రాజా సాబ్’లో మాళవిక మోహనన్, నిధి అగర్వాల్, రిద్ధి కుమార్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ముగ్గురు హీరోయిన్లు ఉండటం వల్ల రొమాన్స్, ఎంటర్టైన్మెంట్ డోస్ కూడా ఎక్కువగానే ఉంటుందని చెబుతున్నారు.
సినిమాకు సంబంధించిన బిజినెస్ వివరాలు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అయ్యాయి.తాజా సమాచారం ప్రకారం… ఆంధ్రప్రదేశ్ – తెలంగాణ ప్రాంతాల్లో మాత్రమే₹130 కోట్లకు పైగా ప్రీ–రిలీజ్ బిజినెస్ జరిగినట్లు తెలుస్తోంది. ఒక హారర్ ఫాంటసీ కామెడీ జానర్ సినిమా కోసం ఇంత భారీ రేంజ్ రావడం చాలా అరుదు.దీనితో ప్రభాస్ మార్కెట్ ఎలాంటి స్థాయిలో ఉందో మరోసారి నిరూపితమయ్యింది. దర్శకుడు మారుతి ప్రత్యేకమైన కామెడీ టైమింగ్‌తో ఎంతగానో అలరిస్తాడు అన్న విషయం తెలిసిందే. అతని స్టైల్, ప్రభాస్ స్టార్ పవర్ కలిసివస్తే సినిమా అల్టిమేట్ ఎంటర్టైనర్గా నిలిచే అవకాశం ఉందని సినీ వర్గాలు చెబుతున్నాయి. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మిస్తున్న ఈ చిత్రానికి భారీ ప్రొడక్షన్ విలువలు కూడా మరో పెద్ద హైలైట్. సంక్రాంతి 2026లో ఈ సినిమా సంచలనాలు సృష్టిస్తుంది.