Prabhas | బాహుబలి ప్రాంఛైజీతో వరల్డ్‌వైడ్‌గా అభిమానులను సంపాదించుకొని.. గ్లోబల్ స్టార్ హీరోగా మారిపోయాడు యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ (Prabhas). ఈ స్టార్ యాక్టర్ ప్రస్తుతం రెండు సినిమాలతో బిజీగా ఉన్నాడని తెలిసిందే. వీటిలో ఒకటి మహానటి ఫేం నాగ్ అశ్విన్ దర్శకత్వంలో నటిస్తోన్న మోస్ట్ ఎవెయిటెడ్ కల్కి 2898 ఏడీ (Kalki 2898 AD). సైన్స్ ఫిక్షన్ జోనర్లో తెరకెక్కుతోంది. మరోవైపు మారుతి దర్శకత్వంలో నటిస్తోన్న రాజాసాబ్. హార్రర్ కామెడీ జోనర్లో వస్తోన్న ఈ మూవీ షూటింగ్ దశలో ఉంది.
ప్రొఫెషనల్ కమిట్మెంట్స్తో బిజీగా ఉన్న ప్రభాస్ సౌండ్ ఇంజినీర్ పప్పు కూతురు, కుమారుడి హాఫ్ శారీ/ధోతి ఫంక్షన్‌కు హాజరయ్యాడు. హైదరాబాద్లోఇన Avasa హోటల్లో జరిగిన ఈవెంట్లో ప్రభాస్ బ్లాక్ క్యాప్, షర్ట్, గాగుల్స్‌లో సూపర్ కూల్ స్టైలిష్ లుక్‌లో మెరిసిపోతూ ప్రత్యేక ఆకర్షణగా నిలిచాడు. ఇప్పుడీ ఫొటోలకు ప్రభాస్ అభిమానులు, నెటిజన్లు ఫిదా అయిపోతున్నారు.
కాగా మేకర్స్ ఇప్పటికే లాంఛ్ చేసిన కల్కి 2898 ఏడీ టైటిల్, గ్లింప్స్ వీడియో, టీజర్ మిలియన్ల సంఖ్యలో వ్యూస్ రాబడుతూ సినిమాపై క్యూరియాసిటీ పెంచుతోంది. ఈ మూవీలో బాలీవుడ్ భామలు దీపికా పదుకొనే, దిశా పటానీ ఫీ మేల్ లీడ్ రోల్స్‌లో నటిస్తుండగా.. అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, రాజేంద్రప్రసాద్, పశుపతి ఇతర ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. రాజాసాబ్ చిత్రంలో మలబార్ సోయగం మాళవిక మోహనన్, ఇస్మార్ట్ భామ నిధి అగర్వాల్ ఫీ మేల్ లీడ్ రోల్స్‌లో నటిస్తున్నారు. రిద్దికుమార్ మరో కీ రోల్లో నటిస్తోంది.
ఈవెంట్లో ప్రభాస్ సందడి ఇలా..
Sound Engineer Pappu’s daughter&son half Saree&Dhoti function Avasa Hotel in Hyderabad 🥰#Prabhas #プラバース#JapanLovesPrabhas#毎日プラバース pic.twitter.com/6GxyBcFwAN
— バタ子 🦖 (@P19791023) April 21, 2024
🥰🥰🥰#Prabhas #プラバース#JapanLovesPrabhas pic.twitter.com/MbpataqFfB
— バタ子 🦖 (@P19791023) April 21, 2024
💖💖💖#Prabhas #プラバース#JapanLovesPrabhas pic.twitter.com/KABPfeaOZU
— バタ子 🦖 (@P19791023) April 21, 2024