Prabhas-Sukumar Movie | ప్రభాస్ ప్రస్తుతం ఇండస్ట్రీలో ఏ హీరో లేనంత బిజీగా ఉన్నాడు. గ్యాప్ లేకుండా వరుస పాన్ ఇండియా సినిమాలు చేస్తూ తీరికలేకుండా గడుపుతున్నాడు. ప్రస్తుతం ప్రభాస్ చేతిలో ఉన్న సినిమాల బడ్జెట్ దాదాపు రెండు వేల కోట్లకు పై మాటే. ‘బాహుబలి’తో అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న ప్రభాస్‌కు ‘సాహో’, ‘రాధేశ్యామ్’ ఫలితాలు కాస్త నిరాశపరిచాయి. అయితే ఈ రెండు సినిమా ఫలితాల ప్రభావం ప్రభాస్ మార్కెట్‌పై ఏ మాత్రం పడలేదు. ప్రభాస్ ప్రస్తుతం ‘ప్రాజెక్ట్-K’, ‘సలార్’, మారుతీతో హర్రర్ కామెడీ సినిమాలను చేస్తున్నాడు. ఇక అవి సెట్స్ పైన ఉండగానే మరిన్ని కొత్త కథలు వింటున్నాడు. కాగా తాజాగా ప్రభాస్ మరో స్టార్ దర్శకుడితో చేతులు కలుపనున్నట్లు తెలుస్తుంది.
టాలీవుడ్ వర్గాల సమాచారం ప్రకారం ప్రభాస్, సుకుమార్‌తో సినిమా చేయనున్నట్లు తెలుస్తుంది. సుకుమార్ తన కెరీర్ బిగెనింగ్ నుండి ప్రభాస్‌తో సినిమా చేయాడానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నాడు. సుకుమార్ ‘ఆర్య’ కథ ముందుగా ప్రభాస్‌కే వినిపించాడట. కానీ ప్రభాస్‌కు అప్పుడున్న కమిట్మెంట్స్ కారణంగా నో చెప్పాడట. ఆ తర్వాత ఎన్ని సార్లు ప్రయత్నించిన వీళ్ళ కాంబో కుదరలేదు. ఇన్నేళ్లకు సుకుమార్ కోరిక తీరబోతున్నట్లు తెలుస్తుంది. ఇటీవలే ప్రభాస్‌కు సుకుమార్ కథను నెరేట్ చేశాడట. ప్రభాస్ కూడా వెంటనే ఓకే చెప్పాడట. ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్‌ను అభిషేక్ అగర్వాల్ నిర్మించనున్నాడట. ‘పుష్ప-2’ తర్వాత ఈ ప్రాజెక్ట్ సెట్స్ మీదకు వెళ్లనున్నట్లు సమచారం. త్వరలోనే దీనిపై అధికారిక ప్రకటన రానుంది.
ప్రభాస్ నటించిన ‘ఆదిపురుష్’ పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటుంది. ‘సలార్’ మూవీ 85% షూటింగ్ పూర్తి చేసుకుంది. ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా సెప్టెంబర్ 28న రిలీజ్ కానుంది. ఇక పాన్ వరల్డ్ సినిమాగా తెరకెక్కుతున్న ‘ప్రాజెక్ట్-K’ ప్రస్తుతం రామోజీ ఫిలిం సిటీలో షూటింగ్ జరుపుకుంటుంది. వీటితో పాటుగా మారుతి దర్శకత్వంలో ఓ హర్రర్ కామెడీ సినిమా చేస్తున్నాడు. లో ప్రొఫైల్‌లో ఈ సినిమా షూటింగ్ జరుగుతుంది.