Prabhas | పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ మరోసారి తన క్రేజ్‌ను విదేశాల్లో నిరూపించాడు. జపాన్‌లో జరిగిన ‘బాహుబలి: ది ఎపిక్’ ప్రత్యేక ప్రదర్శనకు హాజరైన ప్రభాస్, అక్కడ అభిమానులతో కాసేపు ముచ్చటించారు. ఈ సందర్బంగా తీసిన ఫోటోలు సోషల్ మీడియాలో ఇప్పుడు దుమ్ము రేపుతున్నాయి. ఈ ఫోటోలలో ప్రభాస్ కనిపించిన కొత్త లుక్ ప్రత్యేక ఆకర్షణగా మారింది. ఇప్పటివరకు చూడని స్టైలిష్ అవతారంలో కనిపించిన డార్లింగ్, జపాన్ అభిమానులను మాత్రమే కాదు, ఇండియన్ సినీ లవర్స్‌ని కూడా షాక్‌కి గురి చేశారు. ప్రభాస్ తాజా లుక్ చూసిన అభిమానులు.. ఈ లుక్ స్పిరిట్ది అయి ఉంటుందేమో అని అంటున్నారు.
జపాన్ ఫ్యాన్స్‌తో ప్రభాస్ ఆప్యాయంగా మాట్లాడిన వీడియోలు, ఫోటోలు జపనీస్ సోషల్ మీడియా ప్లాట్ఫామ్ల్లో తెగ వైరల్ అవుతున్నాయి. దీంతో మరోసారి ‘బాహుబలి’ మేనియా కనిపిస్తోంది. ఇటీవల బాహుబలి ది ఎపిక్ చిత్రం ఇండియాలో విడుదలై మంచి టాక్ అందుకుది. బాహుబలి రెండు పార్ట్‌లని ఒక పార్ట్‌గా చేసి బాహుబలి ది ఎపిక్ పేరుతో విడుదల చేశారు. ఇక ఇదిలా ఉంటే ప్రభాస్ ప్రస్తుతం రెండు భారీ పాన్-ఇండియా ప్రాజెక్టుల్లో బిజీగా ఉన్న విషయం తెలిసిందే. హను రాఘవపూడి దర్శకత్వంలో ఫౌజీ అనే చిత్రం చేస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ చాలా కాలం క్రితమే ప్రారంభమైంది. ఆర్మీ నేపథ్యంతో తెరకెక్కుతున్న ఈ చిత్రం కోసం ప్రభాస్ కొత్త లుక్ ట్రై చేస్తున్నాడనే ప్రచారం వినిపిస్తోంది.
మరోవైపు సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో స్పిరిట్ అనే చిత్రం చేస్తున్నాడు. ఈ మూవీ షూటింగ్ ఇటీవలే మొదలైంది. సందీప్ వంగా సినిమా కోసం ప్రభాస్ మరింత రగ్గడ్, ఇన్టెన్స్ లుక్‌లో కనిపిస్తున్నాడా? అంటూ అభిమానులు అనుమానిస్తున్నారు.ఈ రెండు సినిమాలలో ఏదో ఒక సినిమా కోసం ప్రభాస్ ఈ లుక్ మెయింటైన్ చేస్తున్నాడని ముచ్చటించుకుంటున్నారు. స్క్రీన్‌పై ఇలా కనిపిస్తే కేకే! కొత్త లుక్ ఫుల్ ఫైర్ అంటూ నెటిజన్లు రియాక్ట్ అవుతూ కామెంట్స్ పెడుతున్నారు. ప్రభాస్ కొత్త ఫోటోలు షేర్ అయిన కొన్ని గంటల్లోనే వేలాది లైక్స్, రీట్వీట్లతో రచ్చ చేస్తున్నాయి. ప్రపంచవ్యాప్తంగా ఉన్న డార్లింగ్ అభిమానులు ఈ లుక్‌ను చూసి మైమరిచిపోతున్నారు.