పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్ (Prabhas) ప్రస్తుతం బ్యాక్ టు బ్యాక్ సినిమాలను లైన్లో పెట్టిన సంగతి తెలిసిందే. ఈ ప్రాజెక్టుల్లో ఒకటి ఆది పురుష్ (Adipurush). బాలీవుడ్ డైరెక్టర్ ఓం రౌత్ (Om Raut) దర్శకత్వం వహిస్తున్నాడు. హై బడ్జెట్ మైథలాజికల్ మూవీగా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో కృతిసనన్ ఫీ మేల్ లీడ్ రోల్లో నటిస్తుండగా..సైఫ్ అలీఖాన్ లంకేశ్ పాత్రలో నటిస్తున్నాడు. కాగా కొన్ని రోజులు ఈ ప్రాజెక్టుకు సంబంధించిన అప్ డేట్ ఏం బయటకు రాలేదు.
అయితే తాజాగా ప్రభాస్ డైరెక్టర్ ఓం రౌత్ ఇంటి దగ్గర ప్రత్యక్షమైన స్టిల్ ఇపుడు నెట్టింట్లో వైరల్ అవుతోంది. తాజా అప్ డేట్ ప్రకారం ఓం రౌత్ బాంద్రాలోని తన ఇంట్లో మంగళవారం రాత్రి గ్రాండ్ పార్టీ ఏర్పాటు చేశాడట. ఈ పార్టీకి బ్లాక్ జీన్స్, మెరూన్ కలర్ షర్ట్‌లో స్పెషల్ లుక్ లో కనిపిస్తున్నాడు ప్రభాస్. స్లిమ్‌గా కనిపిస్తున్న డార్లింగ్ ప్రభాస్ స్టిల్‌ను చూసి తెగ ఖుషీ అవుతున్నారు ఫ్యాన్స్. ఆదిపురుష్ వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు రానుంది.
టీ సిరీస్-రెట్రోఫైల్స్ లిమిటెడ్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి సాచెట్-పరంపర మ్యూజిక్ అందిస్తున్నారు. షూటింగ్‌కు సంబంధించిన మరిన్ని వివరాలపై త్వరలోనే క్లారిటీ వచ్చే అవకాశాలున్నాయి. ఈ ప్రాజెక్టులో కృతిసనన్ సీత పాత్రలో నటిస్తుండగా..సన్నీ సింగ్ లక్ష్మణుడిగా, దేవ్ దత్తా నగే హనుమాన్ రోల్లో కనిపించబోతున్నాడు.