Prabhas | ఆరు నెలల్లో ‘స్పిరిట్’ పూర్తి.. అతిథి పాత్రల్లో రణబీర్‌కపూర్, రౌడీస్టార్!
‘కల్కి’ చిత్రంతో వరల్డ్‌వైడ్‌గా బ్లాక్‌బస్టర్ హిట్‌ను సొంతం చేసుకున్నారు ప్రభాస్. ప్రస్తుతం ఆయన ‘రాజా సాబ్' ‘ఫౌజీ’ చిత్రాలను పూర్తి చేసే పనిలో ఉన్నారు. ఆ తర్వాత సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో తెరకెక్కనున్న ‘స్పిరిట్' సినిమాలో జాయిన్ అవుతారు.
Prabhas | ‘కల్కి’ చిత్రంతో వరల్డ్‌వైడ్‌గా బ్లాక్‌బస్టర్ హిట్‌ను సొంతం చేసుకున్నారు ప్రభాస్. ప్రస్తుతం ఆయన ‘రాజా సాబ్’ ‘ఫౌజీ’ చిత్రాలను పూర్తి చేసే పనిలో ఉన్నారు. ఆ తర్వాత సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో తెరకెక్కనున్న ‘స్పిరిట్’ సినిమాలో జాయిన్ అవుతారు. ‘యానిమల్’ వంటి సంచలన చిత్రం తర్వాత సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో రాబోతున్న ఈ సినిమాపై సర్వత్రా ఆసక్తి నెలకొని ఉంది. ఈ సినిమాలో ప్రభాస్ పవర్ఫుల్ పోలీస్ పాత్రలో కనిపించనున్నారు. ఇందులో ఆయన డ్యూయల్ రోల్‌ను పోషించనున్నారని, రణబీర్‌కపూర్, విజయ్ దేవరకొండ అతిథి పాత్రల్లో నటిస్తారనే వార్తలు వినిపిస్తున్నాయి.
ఇదిలావుండగా.. తాజా ఇంటర్వ్యూలో ‘స్పిరిట్’ నిర్మాతల్లో ఒకరైన భూషణ్ కుమార్ ఆసక్తికరమైన విషయాన్ని వెల్లడించారు. డిసెంబర్ నెలాఖరులో సినిమాను సెట్స్‌మీదకు తీసుకెళ్తామని, ఆరు నెలల వ్యవధిలో షూటింగ్‌ను పూర్తి చేస్తామని పేర్కొన్నారు. దీనిని బట్టి వచ్చే దసరా కల్లా ‘స్పిరిట్’ విడుదలకు సిద్ధంగా ఉంటుందని అభిమానులు ఆంచనా వేస్తున్నారు. ‘స్పిరిట్’ పక్కా కమర్షియల్ సినిమా కాబట్టి షూటింగ్‌ను త్వరగా పూర్తి చేసే ఆలోచనలో మేకర్స్ ఉన్నారని, పోస్ట్ప్రొడక్షన్స్కు కూడా అంతగా సమయం పట్టకపోవచ్చని ట్రేడ్ వర్గాలు విశ్లేషిస్తున్నాయి.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
YS Jagan | ఎన్నికల నిర్వహణకు కేంద్ర బలగాలను రప్పించాలి.. ఎస్ఈసీకి వినతిపత్రం అందజేసిన వైఎస్ జగన్
JD Vance | ‘ఇండియా విషయంలో హద్దులు దాటా.. ఆ పదం వాడటం కరెక్ట్ కాదు’ : జేడీ వాన్స్
Surya Prabha Vahanam | సూర్యప్రభ వాహనంపై శ్రీ మలయప్పస్వామి దివ్యదర్శనం
Greater Noida | డ్రగ్స్ తయారీ ల్యాబ్ గుట్టురట్టు.. రూ.45 కోట్ల విలువైన డ్రగ్స్ పట్టివేత.. ఇద్దరు నిందితులు అరెస్టు
Janakiram Marella | ‘కామ్రేడ్ కళ్యాణ్’తో సంచలనం.. తొలి సినిమాతోనే బ్లాక్ బస్టర్ కొట్టిన దర్శకుడు జానకిరామ్ మారెళ్ల
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్

