Spirit Movie | యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా, సంచలన దర్శకుడు సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో తెరకెక్కుతున్న ప్రతిష్టాత్మక చిత్రం ‘స్పిరిట్’ (Spirit). ప్రస్తుతం ప్రీ-ప్రొడక్షన్ దశలో ఉన్న ఈ చిత్రం త్వరలోనే సెట్స్ మీదకి వెళ్లనున్న విషయం తెలిసిందే. ఇదిలావుంటే తాజాగా ఈ మూవీ నుంచి ఒక సాలిడ్ అప్డేట్ బయటకు వచ్చింది. ఈ సినిమాకు మాస్ మహారాజా రవితేజ కుమారుడు మహాధన్ భూపతిరాజు పనిచేయబోతున్నట్లు సమాచారం. హీరోగా ఎంట్రీ ఇస్తారని అంతా భావించిన రవితేజ కుమారుడు మహాధన్, నటన కంటే సినిమా దర్శకత్వం వైపు మొగ్గు చూపినట్లు తెలుస్తోంది. మహాధన్ ‘స్పిరిట్’ సినిమాకు అసిస్టెంట్ డైరెక్టర్‌గా (AD) పనిచేయనున్నారని సమాచారం.
ఈ చిత్రానికి మహాధన్‌తో పాటు స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ కుమారుడు రిషి మనోజ్ కూడా అసిస్టెంట్ డైరెక్టర్‌గా పనిచేయబోతున్నట్లు తెలుస్తోంది. ఇద్దరు అగ్రశ్రేణి సినీ ప్రముఖుల వారసులు దర్శకత్వ శాఖలో పనిచేయడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. రవితేజ కూడా తన సినీ కెరీర్‌ను హీరోగా కాకుండా అసిస్టెంట్ డైరెక్టర్‌గా ప్రారంభించిన విషయం తెలిసిందే. ఇప్పుడు ఆయన కుమారుడు కూడా అదే బాటలో ప్రయాణించడం విశేషం.
‘స్పిరిట్’ సినిమా విషయానికి వస్తే.. ఈ ప్రాజెక్ట్‌లో ప్రభాస్ ఒక నిజాయితీ గల పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించనున్నారు. త్వరలోనే ఈ సినిమా షూటింగ్ ప్రారంభం కానుంది. ప్రకాశ్ రాజ్, వివేక్ ఒబెరాయ్ కీలక పాత్రల్లో కనిపించబోతున్నారు.