Prabhas Talk In Japanese | అగ్ర కథానాయకుడు ప్రభాస్ నటించిన బ్లాక్ బస్టర్ చిత్రం ‘కల్కి 2898 ఏడీ’ (Kalki Japan Release) జపాన్‌లో విడుదల అవుతున్న విషయం తెలిసిందే. వచ్చే ఏడాది జనవరి 03న జపనీస్ భాషలో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా ప్రమోషన్స్ కోసం చిత్రయూనిట్ జపాన్ వెళ్లిన విషయం తెలిసిందే. దర్శకుడు నాగ్ అశ్విన్ ఇప్పటికే జపాన్ చేరుకొని వరుస ప్రమోషన్స్‌లో పాల్గోంటున్నాడు. అయితే మూవీ ప్రమోషన్స్‌కి జపాన్‌కి ప్రభాస్ వెళ్లలేకపోతున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే.
ఈ సందర్భంగా జపాన్ అభిమానుల కోసం ప్రత్యేక వీడియోను రిలీజ్ చేశాడు. ఈ వీడియోలో ప్రభాస్ జపనీస్‌లో మాట్లాడుతూ.. తాను జపాన్‌కి రాలేకపోతున్నానంటూ ఫ్యాన్స్‌కు క్షమాపణలు చెప్పారు ప్రభాస్. ఒక సినిమా షూటింగ్లో భాగంగా కాలికి గాయం కావడంతో ప్రస్తుతానికి రాలేకపోతున్నానని, త్వరలోనే కలుస్తానని అభిమానులకు చెప్పారు. అప్పటివరకు కల్కి సినిమాను ఎంజాయ్ చేయండి అంటూ చెప్పుకోచ్చాడు. ప్రభాస్ జపనీస్‌లో మాట్లాడడంతో ఈ వీడియో వైరల్ అవుతుంది.
#プラバース から日本のすべてのファンの皆さんへメッセージ 🫶❤️🔥
– https://t.co/cdYjzaaaUm#Kalki2898AD releasing in cinemas across Japan from January 3rd!#カルキ2898AD #Kalki2898ADinJapan@SrBachchan @ikamalhaasan #Prabhas @deepikapadukone @nagashwin7 @DishPatani… pic.twitter.com/woLBrBtK7W
— Vyjayanthi Movies (@VyjayanthiFilms) December 18, 2024