Prabhas | ‘ధురంధర్ 2’ థియేటర్లో ప్రభాస్.. సందీప్ వంగా ప్లాన్ వెనుక అసలు కారణం ఇదేనా?
Prabhas | బాక్సాఫీస్ వద్ద సత్తా చాటుతున్న ‘ధురంధర్ 2’ మరోసారి వార్తల్లో నిలిచింది. టాలీవుడ్ స్టార్ హీరో ప్రభాస్, దర్శకుడు సందీప్ రెడ్డి కలిసి హైదరాబాద్‌లోని అల్లు సినిమాలో ఈ సినిమాను వీక్షించడం ఇప్పుడు సినీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. సాధారణంగా పబ్లిక్‌గా ఎక్కువగా కనిపించని ప్రభాస్‌ను థియేటర్‌కు తీసుకువచ్చి, ఆడియన్స్ మధ్య సినిమా చూడటం అనేది అరుదైన విషయం.
Prabhas | బాక్సాఫీస్ వద్ద సత్తా చాటుతున్న ‘ధురంధర్ 2’ మరోసారి వార్తల్లో నిలిచింది. టాలీవుడ్ స్టార్ హీరో ప్రభాస్, దర్శకుడు సందీప్ రెడ్డి కలిసి హైదరాబాద్‌లోని అల్లు సినిమాలో ఈ సినిమాను వీక్షించడం ఇప్పుడు సినీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. సాధారణంగా పబ్లిక్‌గా ఎక్కువగా కనిపించని ప్రభాస్‌ను థియేటర్‌కు తీసుకువచ్చి, ఆడియన్స్ మధ్య సినిమా చూడటం అనేది అరుదైన విషయం. ‘ధురంధర్ 2’లో రణ్వీర్ సింగ్ ఇచ్చిన హై-వోల్టేజ్ పెర్ఫార్మెన్స్కు ప్రేక్షకుల నుంచి వచ్చిన స్పందనను ప్రత్యక్షంగా చూసిన ప్రభాస్ ఆనందం వ్యక్తం చేసినట్లు సమాచారం.
‘బాహుబలి 2’ తర్వాత ప్రభాస్ సినిమాల్లో పాత ఎనర్జీ తగ్గిందనే విమర్శలు సోషల్ మీడియాలో తరచూ వినిపిస్తున్నాయి. స్క్రీన్ ప్రెజెన్స్, నటనలో పాత ఫైర్ కనిపించడం లేదన్న కామెంట్లు కూడా వచ్చాయి. ఈ నేపథ్యంలో ప్రభాస్ తన తదుపరి చిత్రం ‘స్పిరిట్’ కోసం సందీప్ వంగాతో చేతులు కలపడం ఆసక్తికరంగా మారింది. సినిమాలను రాజీ లేకుండా తెరకెక్కించే దర్శకుడిగా గుర్తింపు పొందిన సందీప్ వంగా, ప్రభాస్‌ను థియేటర్‌కు తీసుకువెళ్లడం వెనుక ఒక ప్రత్యేక ఆలోచన ఉందని సినీ వర్గాలు చెబుతున్నాయి. ప్రేక్షకుల్లో ఉన్న ఎనర్జీ, ఒక నటుడి పట్ల ఉన్న అంచనాలు ప్రత్యక్షంగా అనుభవించాలనే ఉద్దేశంతో ఈ ప్లాన్ చేసినట్లు భావిస్తున్నారు.
రణవీర్ సింగ్ వంటి ఎనర్జిటిక్ నటుడి పెర్ఫార్మెన్స్ను దగ్గరగా చూసిన ప్రభాస్, ‘స్పిరిట్’ కోసం తనను తాను కొత్తగా మలుచుకునే అవకాశం ఉందని విశ్లేషకులు అంటున్నారు. ఈ థియేటర్ అనుభవం ఆయనలో పాత స్పార్క్‌ను మళ్లీ రగిలించగలదని అభిప్రాయపడుతున్నారు. ‘ధురంధర్ 2’ థియేటర్ విజిట్ కేవలం సినిమా చూడటానికి మాత్రమే కాకుండా, ప్రభాస్ కెరీర్లో ఒక కొత్త మలుపు తీసుకురావడానికి కారణమవుతుందా అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ‘స్పిరిట్’లో మరింత పవర్ఫుల్ ప్రభాస్‌ను చూడాలని అభిమానులు ఎదురుచూస్తున్నారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Supreme Court | ఇంటర్నెట్ వినియోగం పిల్లల ప్రాథమిక హక్కు : సుప్రీంకోర్టు
Post-Mortem Room: పోస్టుమార్టమ్ రూమ్‌లో లిక్కర్ పార్టీ.. వీడియో వైరల్ కావడంతో డాక్టర్ సస్పెన్షన్
SlumDog 33 Temple Road | షూటింగ్ పూర్తి చేసుకున్న పూరి- విజయ్ సేతుపతి ‘స్లమ్‌డాగ్ – 33 టెంపుల్ రోడ్!
Unemployees | వేసిందే తక్కువ పోస్టులు.. టీజీపీఎస్సీ ఎదుట నిరుద్యోగుల ఆందోళన.. వీడియో
Jobs | సెంట్రల్ వేర్‌హౌసింగ్ కార్పొరేషన్లో 327 అసిస్టెంట్ మేనేజర్, జూనియర్ ఎగ్జిక్యూటివ్ ఖాళీలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

