Prabhas Sprit Movie | ప్రభాస్ సినిమా లైనప్‌లో ‘స్పిరిట్’ కూడా ఒకటి. సందీప్ రెడ్డి వంగా దర్శకత్వం వహించనున్న ఈ సినిమాను ఏడాదిన్నర కిందటే ప్రకటించారు. కానీ ఇప్పటివరకు పట్టాలెక్కలేదు. ఓ వైపు ప్రభాస్ తన సినిమాలో బిజీగా ఉండగా.. మరోవైపు సందీప్,రణ్‌బీర్ ‘యానిమల్’తో బిజీగా ఉన్నాడు. దాంతో ఈ సినిమా ఉందా లేదా అనే అనుమానాలు కూడా చాలా మంది మదిలో మెదిలాయి. కాగా తాజాగా బాలీవుడ్ నిర్మాత భూషణ్ కుమార్ స్పిరిట్ సినిమా గురించి పలు ఆసక్తిరవిషయాలను చెప్పాడు.
స్పిరిట్ మూవీ ఈ ఏడాది చివర్లో పట్టాలెక్కుందని క్లారిటీ ఇచ్చాడు. ఈ మూవీ కొత్త కాన్సెప్ట్‌తో రూపొందుతుందని, ప్రభాస్ ఇందులో పోలీస్ పాత్రలో కనిపిస్తాడని చెప్పాడు. అంతేకాకుండా ఇప్పటివరకు మనం చూసిన పోలీస్ క్యారెక్టర్లకు.. ఈ సినిమాలో పోలీస్ క్యారెక్టర్‌కు సంబంధమే ఉండదని తెలిపాడు. ఇక ప్రభాస్ ఇప్పటివరకు పోలీస్ పాత్ర చేయలేదు. మొదటి సారిగా తన 25వ సినిమాకు పోలీస్ పాత్ర వేస్తుండటంతో అభిమానుల్లో తీవ్ర ఆసక్తి నెలకొంది.
ప్రస్తుతం ప్రభాస్ ‘సలార్’, ‘ప్రాజెక్ట్-K’ సినిమా షూటింగ్లలో బిజీగా ఉన్నాడు. ఈ ఏడాది చివరి వరకు ఈ రెండు సినిమా షూటింగ్‌లను పూర్తి చేయాలని భావిస్తున్నాడు. ఆ తర్వాత ‘స్పిరిట్’పై ఫోకస్ పెట్టనున్నాడు. ఇక రామాయణం నేపథ్యంలో తెరకెక్కిన ‘ఆదిపురుష్’ షూటింగ్ పూర్తి చేసుకుని పోస్ట్ ప్రొడక్షన్ పనులలో బిజీగా ఉంది.