అగ్రహీరో ప్రభాస్ ఇటీవలే ‘స్పిరిట్’ సెట్లోకి అడుగుపెట్టారు. సందీప్‌రెడ్డి వంగా దర్శకత్వంలో రూపొందుతున్న ఈ పాన్ వరల్డ్ యాక్షన్ థ్రిల్లర్‌లో ప్రభాస్ సిన్సియర్ అండ్ పవర్ఫుల్ పోలీస్ అధికారి పాత్రలో కనిపించబోతున్నారు. ప్రస్తుతం హైదరాబాద్‌లో చిత్రీకరణ జరుగుతున్నది. రెండునెలల పాటు జరిగే నాన్‌స్టాప్ షెడ్యూల్ ఇదని సమాచారం. ఈ షెడ్యూల్ కోసం ఓ స్పెషల్ పోలీస్ స్టేషన్ సెట్‌ను తీర్చిదిద్దారని తెలిసింది.
ఇందులో ప్రభాస్ ఉపోద్ఘాత గీతాన్ని తెరకెక్కించబోతున్నారట. ఈ సాంగ్ పూర్తయిన తర్వాత యాక్షన్ ఎపిసోడ్స్ షూటింగ్ మొదలుపెడతారని సమాచారం. ఈ సినిమాలో పోరాటఘట్టాలు ఇప్పటివరకు చూడని రీతిలో ఇంటెన్స్ ఎమోషన్స్‌తో ఉంటాయని, సినిమాకు హైలైట్‌గా నిలుస్తాయని చెబుతున్నారు. త్రిప్తి దిమ్రీ కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రాన్ని టీ సిరీస్ ఫిల్మ్స్, భద్రకాళి పిక్చర్స్ పతాకాలపై భూషణ్ కుమార్, ప్రణయ్‌రెడ్డి వంగా, క్రిషన్ కుమార్ నిర్మిస్తున్నారు.