పాన్ఇండియా స్టార్ ప్రభాస్ చేస్తున్న సినిమాల సినేరియానే భిన్నంగా ఉంటున్నాయి. హాలీవుడ్‌ని తలపించే సినిమాలు చేస్తున్నారాయన. ఇప్పటివరకూ వచ్చిన సినిమాలన్నీ దాదాపు అలాంటివే. ప్రస్తుతానికి ఆ విధానానికి కాస్త కామా పెట్టి, ఆయన చేస్తున్న పూర్తి స్థాయి తెలుగు సినిమా ‘రాజా సాబ్’. ఇది ఫక్త్ టాలీవుడ్ మార్క్ ఎంటర్టైనర్ అని చెప్పాలి. పైగా తన ఇమేజ్‌కి భిన్నంగా రొమాంటిక్ హారర్ కామెడీ కథలో ప్రభాస్ నటించడం మరో విశేషం.
పీపుల్ మీడియా ఫ్యాక్టర్ పతాకంపై టీజీ విశ్వప్రసాద్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి దర్శకుడు మారుతి. విడుదలకు ముందే ఈ సినిమాపై భారీ అంచనాలున్నాయి. వచ్చే ఏడాది ఏప్రిల్ 10న పాన్ఇండియా స్థాయిలో ఈ సినిమా విడుదల కానుంది. ఈ సందర్భంగా ఏడాది ముందు నుంచే మేకర్స్ ప్రమోషన్స్ షురూ చేశారు. సోమవారం ఈసినిమా గ్లింప్స్‌ని విడుదల చేశారు. ప్రభాస్ వింటేజ్ లుక్ ఈ గ్లింప్కే కొత్త అందాన్ని తెచ్చిందని మేకర్స్ అంటున్నారు. ఈ సినిమా షూటింగ్ 40శాతం పూర్తయిందని, ప్రభాస్ ఫ్యాన్స్‌కు ఎప్పటికీ గుర్తుండిపోయే తీపి జ్ఞాపకంగా ఈసినిమా నిలుస్తుందని మేకర్స్ నమ్మకం వ్యక్తం చేస్తున్నారు.