Prabhas | రెబల్ స్టార్ ప్రభాస్ – డైరెక్టర్ మారుతీ కాంబినేషన్లో రూపొందుతున్న హారర్-కామెడీ చిత్రం ‘రాజా సాబ్’ కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న విషయం తెలిసిందే. ప్రారంభంలో, ప్రభాస్ లాంటి బిగ్గెస్ట్ స్టార్ హారర్-కామెడీ సినిమాలో నటించడంపై ఫ్యాన్స్ కొంత అసంతృప్తి వ్యక్తం చేశారు. “ఇది ప్రభాస్ లెవల్ సినిమా కాదు” అని ట్విట్టర్లో హ్యాష్‌ట్యాగ్ ట్రెండింగ్ కూడా అయ్యింది. కానీ ఆ తర్వాత బయటకు వచ్చిన ప్రమోషనల్ కంటెంట్, వింటేజ్ ప్రభాస్ మాస్ సీన్స్, టీజర్, ట్రైలర్ లు ఫ్యాన్స్ ఎక్స్పెక్టేషన్స్ మరింత పెంచాయి. ఇప్పుడు అభిమానులు ఈ సినిమా వెయ్యి కోట్ల గ్రాస్ సాధించనుందనే నమ్మకంతో ఉన్నారు. అయితే ఈ మూవీ వాయిదాల మీద వాయిదాలు పడుతుండడం ఫ్యాన్స్‌ని కాస్త హర్ట్ చేస్తుంది.
మొదట ఈ సినిమా ఏప్రిల్ 11, 2025కి ప్లాన్ చేయబడింది. గ్రాఫిక్స్ వర్క్ పూర్తి కాకపోవడంతో డిసెంబర్ 5, 2025కి వాయిదా పడింది. తర్వాత ప్రీ-రిలీజ్ బిజినెస్ కారణంగా జనవరి 9, 2026న రిలీజ్ చేయాలని భావించారు. కాని తాజాగా, మేకర్స్ సినిమాని న్యూ ఇయర్ రోజున అంటే జనవరి 1, 2026 విడుదల చేయాలని ఆలోచిస్తున్నారు. పెద్ద బడ్జెట్, అన్ని ప్రాంతాల్లో ప్రీ-రిలీజ్ బిజినెస్, సోలో రిలీజ్ కోసం కనీసం 10 రోజుల సమయం అవసరమని పరిగణిస్తూ ఈ ప్రీ-పోనింగ్ అంశాన్ని పరిశీలిస్తున్నారు. ప్రీ-ఫెస్టివల్ సమయాల్లో సినిమాల కలెక్షన్స్ డల్‌గా ఉంటాయి. గతంలో పవన్ కళ్యాణ్ ‘బాలు’, NTR ‘ఆంధ్రావాలా’ సినిమాలు జనవరి 1న విడుదల అయ్యాయి, కానీ కలెక్షన్స్ అంతగా రాబట్టలేకపోయాయి.
సంక్రాంతి సమయంలో విడుదల చేద్దామంటే మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటిస్తున్న ‘మన శంకర్ వరప్రసాద్ గారు’ చిత్రంతో పాటు పలు సినిమాలు బాక్సాఫీస్ దగ్గర తమ సత్తా చూపించేందుకు సిద్ధమయ్యాయి. మరి ఇలాంటి సమయంలో రాజా సాబ్ రిలీజ్ చేసి రిస్క్ చేయడం ఎందుకు అని మేకర్స్ పరిశీలిస్తున్నట్టు తెలుస్తుంది. మరి దీనిపై చిత్ర బృందం ఏదైన క్లారిటీ ఇస్తుందా అనేది చూడాలి.