Prabhas| డార్లింగ్ ప్రభాస్ చివరిగా సలార్ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ చిత్రం బాక్సాఫీస్ దగ్గర పెద్ద విజయం సాధించింది. త్వరలో సలార్2ని కూడా తీసుకురానున్నాడు. అయితే ప్రభాస్ ప్రస్తుతం పలు ప్రాజెక్టులతో బిజీగా ఉండగా, అందులో ఆయన చేస్తున్న రాజా సాబ్ చిత్రం కూడా ఉంది. మారుతి దర్శకత్వంలో రూపొందుతున్న రొమాంటిక్ కామెడీ హర్రర్ చిత్రం కోసం ఫ్యాన్స్ కూడా చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ చిత్రంలో ప్రభాస్‌ని సరికొత్త లుక్‌లో చూపించబోతున్నాడట మారుతి. ఇప్పటికే మూవీకి సంబంధించిన గ్లింప్స్ విడుదలైంది. కాని తర్వాత ఎలాంటి అప్డేట్ లేదు.
చాలాకాలంగా ‘ది రాజాసాబ్’ మూవీకి సంబంధించి ఎలాంటి అప్డేట్స్ రాకపోవడంతో ఫ్యాన్స్ కాస్త నిరాశలో ఉన్నారు. అందుకే వీలైనంత తొందరగా అదిరిపోయే టీజర్‌ని రిలీజ్ చేసేందుకు మారుతి ప్రణాళికలు రచిస్తున్నాడట. ఇప్పటికే ఇండస్ట్రీలోని తన సన్నిహితులకు మారుతి రఫ్ కట్ చూపించారని సమాచారం. ఇది చూసిన అందరి నోటా ప్రభాస్ నెవర్ బిఫోర్ అనే ఒకే మాట వినిపిస్తోంది. ప్రభాస్ లుక్స్, డైలాగ్స్ అదిరిపోయాయని అంటున్నారు. ఇందులో సోషల్ మీడియా పాపులర్ డైలాగ్ కూడా ఉంటుందని సమాచారం. ఇప్పటి వరకు ఈ చిత్రం హర్రర్ అని అందరు అనుకున్నారు. కాని మారుతి ఈ మూవీతో సర్ప్రైజ్ ఇవ్వబోతున్నాడట.
టీజర్లో ఉండే షాట్లో స్టైల్, స్టెప్, థ్రిల్ కలగలిపి ఉండడం ప్రేక్షకులకు సర్ప్రైజింగ్గా అనిపిస్తుందట..వచ్చే నెలలో టీజర్ రిలీజ్ కి ప్లాన్ చేస్తుండగా, అందుకు సంబంధించిన పనులు శరవేగంగా జరుగుతున్నాయట. ఇక ఇప్పటివరకు షూట్ చేసిన సినిమా మొత్తం 3 గంటల 30 నిమిషాల ఫుటేజ్ రాగా, ఈ సినిమాని మూడు గంటలలోపే ఎడిట్ చేసి రన్‌టైమ్ తగ్గించే పనిలో మూవీ టీమ్ ఉందట. నిధి అగర్వాల్, మాళవిక మోహనన్ బిజీ షెడ్యూల్ వల్ల సినిమా షూటింగ్ లేట్ అవుతుందని తెలుస్తోంది. ఇదే ఏడాది సెప్టెంబర్ లేదా అక్టోబర్‌లో రిలీజ్ అయ్యే ఛాన్స్ ఉందని టాక్ నడుస్తోంది. ఇందులో బాలీవుడ్ సీనియర్ నటుడు సంజయ్ దత్ కీలక పాత్రను పోషిస్తున్నారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై టీజీ విశ్వప్రసాద్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి తమన్ సంగీతం అందిస్తున్నారు.