Prabhas- Puri | ఒకప్పుడు స్టార్ డైరెక్టర్‌గా ఓ వెలుగు వెలిగిన పూరీ జగన్నాథ్ ఇప్పుడు సక్సెస్‌లు లేక చాలా ఇబ్బంది పడుతున్నాడు. ఈ మధ్య కాలంలో పూరీ చేసిన సినిమాలన్నీ కూడా బాక్సాఫీస్ దగ్గర బోల్తా కొట్టాయి. ప్రస్తుతం ఈ ప్రముఖ దర్శకుడు తన తదుపరి సినిమాను తమిళ స్టార్ విజయ్ సేతుపతితో చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ పాన్ ఇండియా ప్రాజెక్ట్ ని జూలై మొదటి వారంలో ప్రారంభించారు. మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. ఈ చిత్రంలో విజయ్ సేతుపతికి జోడిగా సంయుక్త మీనన్ నటిస్తున్నారు. అయితే తాజాగా పూరీ జగన్నాథ్.. ప్రభాస్‌ని కలవడం చర్చనీయాంశం అయింది. ప్రస్తుతం వీరికి సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.
పూరి, ఛార్మి కలిసి ఈ ఫొటోలను తమ ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేస్తూ, “డార్లింగ్స్ ఫరెవర్” అనే క్యాప్షన్ ఇచ్చారు. ప్రభాస్‌ని ‘ది రాజాసాబ్’ సినిమా సెట్స్‌లో కలిసినట్లు పేర్కొన్నారు. ఈ ఫొటోల్లో పూరిని ప్రభాస్ ప్రేమగా హగ్ చేసుకున్న దృశ్యం ఫ్యాన్స్‌కి విపరీతంగా నచ్చింది. ఈ సమావేశంతో అభిమానుల్లో కొత్త అంచనాలు మొదలయ్యాయి. “ఇన్ని రోజుల తర్వాత కలిశారు అంటే.. కొత్త సినిమా ప్లాన్ చేస్తున్నారా?” అంటూ నెటిజన్లు సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. ప్రభాస్ అభిమానులు అయితే, ‘బుజ్జిగాడు’ టైప్‌లో మరోసారి మాస్ ఎంటర్టైనర్ చేయండి సార్, ఫ్లాప్ అయినా పర్లేదు అంటూ కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. గతంలో పూరి-ప్రభాస్ కాంబినేషన్లో ‘బుజ్జిగాడు’, ‘ఏక్ నిరంజన్’ చిత్రాలు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి.
ఆ మధ్య ప్రభాస్ నటిస్తున్న స్పిరిట్ సినిమాకు పూరీ డైలాగ్స్ రాస్తున్నాడని వార్తలు వచ్చాయి. కాప్ డ్రామా నేపథ్యంలో వచ్చిన పోకిరి, టెంపర్ డైలాగ్స్ బాక్సాఫీస్‌ను ఏ స్థాయిలో షేక్ చేశాయో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. మళ్లీ ఇదే జోనర్లో రాబోతున్న స్పిరిట్ సినిమా కోసం డైలాగ్స్ రాసే విషయమై డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా పూరీని సంప్రదించగా.. గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని ఫిలింనగర్ సర్కిల్ ఇన్ సైడ్ టాక్. మరి ఇందులో నిజం ఎంత ఉందనేది తెలియదు. ఇదే నిజమైతే కాప్ డ్రామా నేపథ్యంలో రాబోతున్న స్పిరిట్‌ను పూరీ డైలాగ్స్ మరో రేంజ్‌కు తీసుకెళ్తాయనడంలో ఎలాంటి సందేహం లేదు.