Prabhas | కల్కి చిత్రం తర్వాత ప్రభాస్ నుండి ఎలాంటి సినిమా రాలేదు. డైరెక్టర్ మారుతి దర్శకత్వం వహిస్తున్న రాజాసాబ్ ప్రస్తుతం చిత్రీకరణ జరుపుకుంటుండగా, ఈ సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుందా అని ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అయితే ప్రభాస్ లిస్ట్‌లో ఇప్పుడు చాలానే సినిమాలు ఉన్నాయి. డైరెక్టర్ హను రాఘవపూడి డైరెక్షన్లో ఓ ప్రాజెక్ట్ చేస్తుండగా, ఈ ప్రాజెక్ట్ తర్వాత ప్రశాంత్ నీల్ డైరెక్షన్లో సలార్ 2, నాగ్ అశ్విన్ తో కల్కి 2 చేయనున్నాడు. మధ్యలో సందీప్ రెడ్డి వంగా డైరెక్షన్లోను ప్రభాస్ ఓ చిత్రం చేయనున్నాడు. స్పిరిట్ అనే టైటిల్‌కి ఈ చిత్రానికి పెట్టారు.
సందీప్ రెడ్డి వంగా కొద్ది రోజుల క్రితం యానిమల్ సినిమాతో పాన్ ఇండియా బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. ఇప్పుడు ‘యానిమల్’ మూవీకి సీక్వెల్‌గా ‘యానిమల్ పార్క్’ తెరకెక్కనుంది. అయితే, ఈ మూవీ తర్వాతే ప్రభాస్ ‘స్పిరిట్’ వస్తుందని.. దాని వలన స్పిరిట్ మరింత ఆలస్యం కానుందంటూ ప్రచారం జరిగింది. ఈ నేపథ్యంలో మూవీ నిర్మాత భూషణ్.. ప్రభాస్ మూవీ షూటింగ్ త్వరలోనే మొదలు కానుందని తెలియజేశారు. 2, 3 నెలల్లోనే ఈ మూవీ షూటింగ్ ప్రారంభం అవుతుందని ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. 2027లో రిలీజ్ చేయనున్నట్లు తెలిపారు. దీంతో ప్రభాస్ ఫ్యాన్స్ ఫుల్ ఖుష్ అవుతున్నారు.
సందీప్ రెడ్డి వంగా.. ప్రభాస్ తో కలిసి ఓ పవర్ పోలీస్ యాక్షన్ డ్రామాను రూపొందించనున్నారు. ఇందులో ప్రభాస్ పోలీస్ అవతారంలో చాలా పవర్ ఫుల్‌గా కనిపించనున్నారు. త్వరలోనే ఈ ప్రాజెక్ట్ సెట్స్ పైకి వెళ్లాల్సి ఉంది. రాజాసాబ్ తర్వాత ప్రభాస్ స్పిరిట్ సినిమా కాకుండా ప్రశాంత్ వర్మతో చేయబోయే సినిమాలో జాయిన్ అవుతాడని జోరుగా ప్రచారాలు కూడా జరిగాయి. తాజాగా నిర్మాత క్లారిటీతో వీటన్నింటికి చెక్ పడ్డట్టు అయింది. 2027లో స్పిరిట్ సినిమా రిలీజ్ చేస్తామని నిర్మాత భూషన్ కుమార్ ప్రకటనతో ఫ్యాన్స్ మురిసిపోతున్నారు. ప్రస్తుతం ఇటలీలో ఉన్న ప్రభాస్ ఇండియాకు తిరిగి వచ్చిన తర్వాత రాజాసాబ్ మూవీ కంప్లీట్ చేసి ఆ తర్వాత స్పిరిట్ మొదలు పెట్టనున్నట్టు సమాచారం.