బాహుబలిగా వెండితెరపై సెన్సేషన్ క్రియేట్ చేసి తెలుగు సినిమా రేంజ్‌ను పెంచడంలో భాగమైన కథానాయకుడు ప్రభాస్. ఆ సినిమా తర్వాత ప్రభాస్ బాక్సాఫీస్ బాహుబలిగా మారాడు. వరుస పాన్ ఇండియా సినిమాల్లో నటించడానికే ఓకే చెప్పాడు. లేటెస్ట్ పీరియాడిక్ మూవీ రాధేశ్యామ్ వచ్చే ఏడాది సంక్రాంతి సందర్భంగా జనవరి 14న విడుదలవుతుంది.
బాలీవుడ్ దర్శకుడు ఓం రౌత్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఆదిపురుష్ చిత్రీకరణ కూడా పూర్తయ్యింది. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో చేస్తోన్న సలార్ సినిమా షూటింగ్ ముగింపు దశకు చేరుకుంది. నాగ్ అశ్విన్ సినిమా పూర్తి కాక ముననుపే ప్రభాస్ తన 25వ చిత్రం స్పిరిట్‌ను సెట్స్‌పైకి తీసుకెళ్లనున్నాడు. అర్జున్ రెడ్డి, కబీర్ సింగ్ వంటి చిత్రాలతో సెన్సేషనల్ హిట్స్ అందుకున్న దర్శకుడు సందీప్ రెడ్డి వంగా ఈ చిత్రాన్ని డైరెక్ట్ చేయనున్నారు.
ప్రభాస్ తను చేసే ప్రతి ఒక్క సినిమా కు కూడా 100 కోట్ల రూపాయల కి పైనే రెమ్యునరేషన్ తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. తాజాగా సందీప్ రెడ్డి వంగా చిత్రానికి ప్రభాస్ 150 కోట్ల రూపాయల పారితోషికం తీసుకుంటున్నట్లు టాక్. ప్రభాస్ చేస్తున్న సినిమాలు, తీసుకుంటున్న పారితోషికాలతో ఇండియా లోనే నంబర్ వన్ హీరో అనడం లో ఎలాంటి సందేహం లేదు అని అంటున్నారు ఫ్యాన్స్.