Prabhas | ‘సలార్’, ‘ప్రాజెక్ట్-k’, ‘మారుతి ప్రాజెక్ట్’ ఇలా బ్యాక్ టు బ్యాక్ భారీ సినిమాలతో ఫుల్ బిజీ అయిపోయాడు పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ (Prabhas). అయితే అంత బిజీ షెడ్యూల్స్‌లోనూ కథలు వింటూ కొత్త సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నాడు. ఈ క్రమంలోనే ఈ ఏడాది దసరాతో తిరుగులేని హిట్టు కొట్టిన శ్రీకాంత్ ఓదెలా(Srikanth Odela)తో ప్రభాస్ సినిమా ఒకే అయినట్లు సమాచారం. దసరా సినిమాతో నానికి వంద కోట్ల సినిమానిచ్చిన శ్రీకాంత్.. ప్రభాస్ కోసం ఓ కథను సిద్ధం చేస్తున్నాడట. అది కూడా ఫుల్ మాస్ స్టోరీ అట. ఇక ప్రభాస్ విని గ్రీన్ సిగ్నల్ ఇవ్వడమే తరువాయని టాలీవుడ్ వర్గాల టాక్. ఇప్పటికే సందీప్ రెడ్డి వంగాతో స్పిరిట్, హనురాఘవపూడితో పీరియాడిక్ స్టోరీ, సిద్ధార్థ్ ఆనంద్ డైరెక్షన్లో యాక్షన్ సినిమా లైన్లో పెట్టాడు ప్రభాస్. ఇక శ్రీకాంత్ ఓదెలా కథ ఒకే అయితే ప్రభాస్ లిస్ట్‌లో మరో దర్శకుడు చేరనున్నాడు. కాగా.. త్వరలోనే దీనిపై అఫీషియల్ ప్రకటన రానుంది.
ప్రస్తుతం ప్రభాస్ నటించిన సలార్ విడుదలకు సిద్ధంగా ఉంది. ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా డిసెంబర్ 22న ప్రేక్షకుల ముందుకు రానుంది. రెండు పార్టులుగా తెరకెక్కుతున్న ఈ సినిమా తొలి భాగానికి సలార్ సీజ్ఫైర్ అనే టైటిల్‌ను పెట్టారు. శృతిహాసన్ హీరోయిన్గా నటిస్తున్న ఈ సినిమాను హోంబలే సంస్థ నిర్మిస్తుంది.