ప్రభాస్ హీరోగా నటిస్తున్న కొత్త సినిమా ‘ప్రాజెక్ట్ కె’. దీపికా పడుకోన్ నాయికగా నటిస్తున్నది. సైన్స్ ఫిక్షన్ కథతో దర్శకుడు నాగ్ అశ్విన్ ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. వచ్చే సంక్రాంతికి జనవరి 12న ఈ సినిమా విడుదల కానుంది. తాజాగా ఈ సినిమా నుంచి ఒక అప్డేట్ బయటకొచ్చింది. ఇప్పటికే సినిమా చిత్రీకరణ మూడొంతులు పూర్తయిందని, అనుకున్న తేదీకి సినిమాను విడుదల చేసే లక్ష్యంతో చిత్రబృందం శ్రమిస్తున్నారని తెలిసింది. చిత్రీకరణతో పాటు సమాంతరంగా నిర్మాణానంతర కార్యక్రమాలు, విజువల్ ఎఫెక్టుల పని కూడా చేయిస్తున్నారట. ఇందుకు పలు వీఎఫ్ఎక్స్ కంపెనీలను మూవీ టీమ్ హైర్ చేసుకున్నట్లు తెలుస్తున్నది. అత్యున్నత సాంకేతిక విలువలతో తెలుగు తెరపై మరో అరుదైన చిత్రంగా ‘ప్రాజెక్ట్ కె’ ఉండనుందనే అంచనాలు ఏర్పడుతున్నాయి.