Spirit Movie | టాలీవుడ్ నటుడు, పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ప్రస్తుతం ‘ది రాజాసాబ్’, ‘ఫౌజీ’ సినిమాలతో బిజీగా ఉన్న విషయం తెలిసిందే. ఈ రెండు సినిమాలను తొందరగా కంప్లీట్ చేసుకుని త్వరలోనే సందీప్ రెడ్డి వంగతో స్పిరిట్ అనే సినిమా చేయబోతున్నాడు. ఈ చిత్రంలో యానిమల్ ఫేం తృప్తి డిమ్రి హీరోయిన్గా నటిస్తుండగా.. భద్రకాళి పిక్చర్స్, టీ సిరీస్‌తో కలిసి సంయుక్తంగా తెరకక్కిస్తున్న ఈ చిత్రానికి హర్షవర్ధన్ రాణే సంగీతం అందిస్తున్నాడు.
ఈ చిత్రంలో ప్రభాస్ పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించబోతుండటంతో అభిమానుల్లో ఈ సినిమాపై అంచనాలు భారీగా పెరిగాయి. అయితే ఈ సినిమాలో ప్రభాస్ లుక్స్ ఎలా ఉండబోతున్నాయో అనే ఆసక్తి అందరిలోనూ నెలకొన్న విషయం తెలిసిందే. తాజాగా దీనికి సంబంధించి ఒక సాలిడ్ న్యూస్ బయటకి వచ్చింది. ఈ సినిమాలో ప్రభాస్ లుక్స్ కోసం ప్రముఖ హెయిర్ స్టైలిస్ట్ ఆలిమ్ హకీమ్ పనిచేయబోతున్నట్లు తెలుస్తుంది. సందీప్ రెడ్డి వంగా గత చిత్రాల హీరోలకు కూడా ఆలిమ్ హకీమ్ లుక్స్ డిజైన్ చేశారు. దీంతో ఈసారి ప్రభాస్‌ను సరికొత్త లుక్‌లో ఎలా చూపిస్తారా అని అభిమానులు ఉత్సాహంగా ఎదురుచూస్తున్నారు. కాగా దీనికి సంబంధించి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.