Prabhas | పాన్ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తున్న తాజా చిత్రం ‘ది రాజా సాబ్’ నుంచి ఆసక్తికర అప్డేట్ బయటకు వచ్చింది. ఇప్పటికే గ్లిమ్స్, టీజర్‌తో ప్రేక్షకులను ఆకట్టుకున్న ఈ సినిమాకు సంబంధించి ఫుల్ లెంగ్త్ ట్రైలర్‌ను అక్టోబర్ 2న విడుదల చేయబోతున్నారు. అయితే ట్రైలర్‌ను యూవీ క్రియేషన్స్ భారీగా ప్లాన్ చేస్తోంది. అదే రోజు విడుదల కాబోతున్న ‘కాంతారా ఛాప్టర్ 1’ సినిమాతో పాటు ‘ది రాజా సాబ్’ ట్రైలర్‌ను థియేటర్లలో స్క్రీన్ చేయనున్నారు. ఇప్పటికే ఈ ట్రైలర్ సెన్సార్ కార్యక్రమాలు పూర్తయ్యాయి. సుమారు 3 నిమిషాల 30 సెకన్ల నిడివి ఉన్న ఈ ట్రైలర్‌కు U/A సర్టిఫికెట్ లభించింది.ఈసారి డైరెక్టర్ మారుతి, టీజర్లో చూపించిన రొమాంటిక్, కామెడీ షేడ్స్‌కి భిన్నంగా, హారర్ – యాక్షన్ ఎలిమెంట్స్‌తో కూడిన ట్రైలర్‌ను రెడీ చేశాడట.
దీంతో సినిమాపై ఉన్న హైప్‌ను మరింత పెంచాలని చూస్తున్నారు మేకర్స్. ఈ చిత్రంలో మాళవిక మోహనన్, నిధి అగర్వాల్, రిద్ధి కుమార్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ముఖ్య పాత్రల్లో వీటీవీ గణేష్, షకలక శంకర్ కనిపించనుండగా, బాలీవుడ్ స్టార్ సంజయ్ దత్ విలన్‌గా తెరపై కనిపించనున్నాడు.మొదట విడుదలైన టీజర్లో డిసెంబర్ 5న సినిమాను రిలీజ్ చేస్తామని ప్రకటించిన చిత్ర బృందం, జనవరి 9, 2025కి చిత్రాన్ని వాయిదా వేసినట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ట్రైలర్లోనే ఖచ్చితమైన రిలీజ్ డేట్‌ను వెల్లడించే అవకాశముందని ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి. ట్రైలర్ విడుదలతో సినిమాపై మిగతా అప్డేట్స్ కూడా రెగ్యులర్‌గా వస్తాయన్న అంచనాలు ఉన్నాయి. ప్రభాస్ ఫ్యాన్స్‌కు ఇది నిజంగా ఒక పెద్ద సర్ప్రైజ్ అని చెప్పవచ్చు.
ప్రభాస్ నుంచి చాలా కాలం తర్వాత ఒక రొమాంటిక్ ఎంటర్టైనర్ గా వస్తున్న రాజా సాబ్ సినిమాపై అంచనాలు మాత్రం భారీగానే ఉన్నాయి. మారుతి కూడా మూవీపై ప్రత్యేక శ్రద్ధ కనబరుస్తున్నారు. ఈ సినిమాతో ప్రభాస్ రేంజ్ మరింత పెరగడం ఖాయం అంటున్నారు. ఇక ప్రభాస్ నుండి త్వరలో ఫౌజీ, సలార్ 2, స్పిరిట్ చిత్రాలు ప్రేక్షకుల ముందుకు రానున్నాయి. ఇందులో కొన్ని చిత్రాలు సెట్స్ పై ఉన్నాయి. స్పిరిట్ కోసం ఫ్యాన్స్ ప్రత్యేకంగా ఎదురు చూస్తున్నారు.