ముంబై : రెబల్ స్టార్ ప్రభాస్, కేజీఎఫ్ ఫేం ప్రశాంత్ నీల్ క్రేజీ కాంబోలో తెరకెక్కిన సలార్ బాక్సాఫీస్ వద్ద వసూళ్ల సునామీ (Salaar Box Office collection Day 4) కొనసాగిస్తోంది. లాంగ్ వీకెండ్‌తో ఈ మూవీ భారీ కలెక్షన్లు రాబడుతుండగా సోమవారం క్రిస్మస్ హాలిడే కావడంతో భారత్‌లో ఏకంగా రూ. 45.77 కోట్లు వసూలు చేసింది.
ఇక నూతన సంవత్సర వేడుకలకు కౌంట్‌డౌన్ షురూ కావడంతో సలార్ వసూళ్లు మరింత ఊపందుకోనున్నాయి. సలార్ నాలుగు రోజుల్లో దేశీ బాక్సాఫీస్ వద్ద రూ. 254.87 కోట్ల నెట్ వసూళ్లను రాబట్టింది. సలార్ విడుదలైన తొలి రోజు ఇండియాలో రూ. 90.7 కోట్లు నెట్ కలెక్షన్స్‌తో ఈ ఏడాది హయ్యస్ట్ ఓపెనర్‌గా నిలిచింది.
తొలి వారాంతంలో రూ. 118.4 కోట్ల నెట్ వసూళ్లు సాధించింది. ఇక విడుదలైన మూడు రోజుల్లోనే సలార్ ప్రపంచవ్యాప్తంగా రూ. 402 కోట్లు కలెక్ట్ చేసిందని చిత్ర బృందం ట్విట్టర్ వేదికగా వెల్లడించింది.
Read More :