పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్ (Prabhas) టాలెంటెడ్ డైరెక్టర్ మారుతి (Maruthi) దర్శకత్వంలో సినిమా చేస్తున్నాడని తెలిసిందే. కొన్ని వారాల క్రితం రెగ్యులర్ షూటింగ్ షురూ అయింది. ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న ఈ మూవీ మరోసారి వార్తల్లో నిలిచింది. తాజా టాక్ ప్రకారం ఈ క్రేజీ సినిమా కొత్త షెడ్యూల్ వచ్చే వారమే మొదలు కానుంది. అంతేకాదు మూవీ లవర్స్ ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న మాళవికా మోహనన్‌కు సంబంధించిన అప్డేట్ నెట్టింట్లో హల్ చల్ చేస్తోంది.
ఈ సోషల్ మీడియా సెన్సేషన్ నెక్ట్స్ షెడ్యూల్ షూట్లో జాయిన్ కాబోతుందట. మరిన్ని వివరాలపై త్వరలోనే క్లారిటీ రానుందని ఇన్సైడ్ టాక్. హార్రర్ కామెడీ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ చ్రితంలో పాపులర్ నటీనటులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ భారీ స్థాయిలో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తోంది. ఇప్పటికే షూటింగ్ లొకేషన్ నుంచి ఓ స్టిల్ నెట్టింట్లో హల్ చల్ చేస్తున్న విషయం తెలిసిందే.
ప్రభాస్ మరోవైపు పాన్ ఇండియా డైరెక్టర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో సలార్ సినిమా చేస్తున్నాడు. షూటింగ్లో దశలో ఉన్న ఈ మూవీ గురించి కొత్త అప్డేట్ రావాల్సి ఉంది. దీంతోపాటు ఓం రౌత్ దర్శకత్వంలో ఆదిపురుష్ కూడా చేస్తున్నాడు. మరోవైపు నాగ్ అశ్విన్ డైరెక్షన్లో ప్రాజెక్ట్-కేలో కూడా నటిస్తున్నాడు.