టాలీవుడ్ స్టార్ హీరో ప్రభాస్ (Prabhas)ప్రస్తుతం బ్యాక్ టు బ్యాక్ పాన్ ఇండియా సినిమాలతో బిజీగా ఉన్నాడని తెలిసిందే. ఇవాళ ప్రభాస్ పుట్టినరోజు సందర్భంగా అభిమానులకు అదిరిపోయే అప్డేట్స్ ఇస్తూ ఫుల్ ఖుషీ చేస్తున్నారు ప్రభాస్ నిర్మాతలు. ప్రభాస్ నటిస్తున్న చిత్రాల్లో ఒకటి సలార్ (Salaar). కేజీఎఫ్ ఫేం ప్రశాంత్ నీల్ (Prashanth Neel)దర్శకత్వం వహిస్తున్నాడు.
తాజాగా ఈ మూవీ నుంచి వర్కింగ్ స్టిల్స్ విడుదల చేయగా..నెట్టింట వైరల్ అవుతున్నాయి. ప్రభాస్ కంటెయినర్‌పై మాస్ స్టైలిష్ లుక్‌లో కనిపిస్తూ.. ఫ్యాన్స్‌కు విజువల్ ట్రీట్ ఇస్తున్నాడు. ప్రభాస్ మాసీ లుక్ సలార్ సినిమాపై క్యూరియాసిటీ, అంచనాలు పెంచేస్తుంది. ఈ చిత్రంలో కోలీవుడ్ భామ శృతిహాసన్ ఫీ మేల్ లీడ్ రోల్లో నటిస్తోంది.
ప్రభాస్ మరోవైపు నాగ్ అశ్విన్ డైరెక్షన్లో నటిస్తోన్న ప్రాజెక్ట్ కే లుక్ ఒకటి కూడా విడుదల చేయగా.. నెట్టింట్లో వైరల్ అవుతోంది. ఈ చిత్రంలో బాలీవుడ్ స్టార్లు అమితాబ్ బచ్చన్, దీపికా పదుకొనే కీలక పాత్రలు పోషిస్తున్నారు. ప్రభాస్ మరోవైపు తానాజీ ఫేం ఓం రౌత్ దర్శకత్వంలో మైథాలాజికల్ ప్రాజెక్ట్ ఆదిపురుష్ కూడా చేస్తున్నాడు. ఇప్పటికే విడుదలైన టీజర్‌కు మిలియన్ల సంఖ్యలో వ్యూస్ వస్తున్నాయి.
Team #Salaar, Wishing #Prabhas a very Happy Birthday. #HappyBirthdayPrabhas @prashanth_neel @VKiragandur @hombalefilms@PrithviOfficial @shrutihaasan @IamJagguBhai@bhuvangowda84 @RaviBasrur @anbariv@shivakumarart @SalaarTheSaga pic.twitter.com/BKFc3sp6RO
— BA Raju's Team (@baraju_SuperHit) October 23, 2022
Read Also : Praveena Paruchuri | కేరాఫ్ కంచెరపాలెం నిర్మాత మూడో సినిమా.. వివరాలివే
Read Also : Prema Desam | రీరిలీజ్ జాబితాలో యూత్‌ఫుల్ లవ్‌స్టోరీ ప్రేమదేశం
Read Also : Amitabh Bachchan | కేబీసీ 14 సెట్స్‌లో అమితాబ్ బచ్చన్ కాలికి గాయం.. బిగ్ బీ క్లారిటీ
Read Also : Nenu Student Sir | నేను స్టూడెంట్ సర్ ప్రమోషన్స్ షురూ.. టీజర్ ఎప్పుడో.. వీడియో