Amitabh Bachchan | కేబీసీ 14 సెట్స్‌లో అమితాబ్ బచ్చన్ కాలికి గాయం.. బిగ్ బీ క్లారిటీ
అమితాబ్ బచ్చన్ (Amitabh Bachchan) పలు సినిమాలతోపాటు బిగ్ బీ చేస్తున్న ప్రాజెక్ట్‌ల జాబితాలో ఉంది కౌర్ బనేగా కరోర్‌పతి సీజన్ -14 (Kaun Banega Crorepati season 14). అయితే అమితాబ్ బచ్చన్ కౌన్ బనేగా కరోర్‌పతి షూటింగ్లో గాయమవగా..ఆయన్ను వెంటనే ఆస్పత్రికి తరలించినట్టు సమాచారం.
ఇటీవలే 80వ పుట్టినరోజు జరుపుకున్నారు బాలీవుడ్ లెజెండరీ స్టార్ అమితాబ్ బచ్చన్ (Amitabh Bachchan). ఈ వయస్సులో కూడా బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో బిజీగా ఉన్నారు. సినిమాలతోపాటు కౌన్ బనేగా కరోర్‌పతి సీజన్ -14 (Kaun Banega Crorepati season 14)బిగ్ బీ చేస్తున్న ప్రాజెక్ట్‌ల జాబితాలో ఉన్నాయి. అయితే అమితాబ్ బచ్చన్ కౌన్ బనేగా కరోర్‌పతి షూటింగ్లో గాయమవగా.. ఆయన్ను వెంటనే ఆస్పత్రికి తరలించినట్టు సమాచారం.
అమితాబ్ బచ్చన్ బ్లాగ్‌లో పేర్కొన్న అప్డేట్ ప్రకారం చిన్న ఇనుప ముక్క ఆయన కాలుకు గుచ్చుకోగా.. తీవ్ర రక్తస్రావమైందట. వెంటనే ఆయన్ను ఆస్పత్రికి తరలించగా.. డాక్టర్లు గాయానికి కుట్లు వేసి యాంటిసెప్టిక్ మందులు ఇవ్వడంతోపాటు కొంతకాలం నడవకూడదని సలహా ఇచ్చారట. ట్రెడ్మిల్ పై కూడా నడవొద్దని, ఒత్తిడి కలగకుండా విశ్రాంతి తీసుకోవాలని డాక్టర్లు సూచించినట్టు తెలియజేశారు బిగ్ బీ.
ప్రస్తుతం తాను ఆరోగ్యం ఉన్నానని, ఎలాంటి ఆందోళన చెందవద్దని అభిమానులకు బ్లాగ్ ద్వారా తెలియజేశారు బిగ్ బీ. అమితాబ్ త్వరగా కోలుకోవాలని ఈ విషయం తెలుసుకున్న ఆయన అభిమానులు, శ్రేయోభిలాషులు ఆ దేవుడ్ని ప్రార్థిస్తున్నారు. ఇటీవలే బ్రహ్మాస్త్ర, గుడ్ బై సినిమాలతో ప్రేక్షకుల ముందుకొచ్చారు అమితాబ్ బచ్చన్. మరోవైపు ప్రభాస్ హీరోగా నటిస్తోన్న ప్రాజెక్ట్ కే సినిమాలో కూడా నటిస్తున్నాడు.
Read Also : Praveena Paruchuri | కేరాఫ్ కంచెరపాలెం నిర్మాత మూడో సినిమా.. వివరాలివే
Read Also : Prema Desam | రీరిలీజ్ జాబితాలో యూత్‌ఫుల్ లవ్‌స్టోరీ ప్రేమదేశం
Read Also : Sir Movie | ధనుష్ ‘సార్’ మూవీ క్రేజీ అప్డేట్..!
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
DMK Ex-Minister Arrested | ప్రైవేట్ స్కూల్స్ నుంచి వంద కోట్లు లంచం ఆరోపణలు.. డీఎంకే మాజీ మంత్రి అరెస్ట్
Rahul Gandhi | ప్రధాని మోదీతో ఆ మాట చెప్పండి నిరసనలు 30 సెకన్లలో ఆగిపోతాయి.. వ్యాపారుల లేఖపై రాహుల్‌గాంధీ..!
Fungus Infections | క్యాన్సర్ లేదా అవయవ మార్పిడి పేషెంట్లకు ఫంగస్ ఇన్ఫెక్షన్లు ఎందుకు ప్రమాదకరం అవుతాయి..?
KTR | లింగన్నపేట బ్రహ్మోత్సవాల్లో కేటీఆర్‌కు ఘనస్వాగతం.. వీడియో
Vande Bharat Sleeper: రెండు కొత్త వందేభారత్ స్లీపర్ రైళ్లు.. రూటు, టైమింగ్ వివరాలు ఇవే
ట్రెండింగ్ వార్తలు
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?

