Prashanth Varma | టాలీవుడ్ దర్శకుడు ప్రశాంత్‌వర్మ (Prashanth Varma) ప్రస్తుతం వరుస సినిమాలతో ఫుల్ బిజీగా మారాడు. ఈయన దర్శకత్వంలో రాబోతున్న తాజా చిత్రం ‘జై హనుమాన్’ (Jai Hanuman). గతేడాది ‘హనుమాన్’తో బ్లాక్ బస్టర్ అందుకున్న ఈ దర్శకుడు ప్రస్తుతం దీనికి సీక్వెల్ ‘జై హనుమాన్’ తెరకెక్కించే పనిలో ఉన్నాడు. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి ఫస్ట్ లుక్ విడుదల చేయగా.. గూస్ బంప్స్ తెప్పించేలా ఉంది.
అయితే ఈ సినిమాతో పాటు నందమూరి బాలకృష్ణ తనయుడు మోక్షజ్ఞతో ఒక సినిమా.. అలాగే ఇండియన్ ఫస్ట్ సూపర్ వుమెన్ ప్రాజెక్ట్ మహాకాళి అనే ప్రాజెక్ట్‌లను చేయబోతున్నాడు ప్రశాంత్ వర్మ. అయితే ఈ మూడు సినిమాలు కాకుండా తన సినిమాటిక్ యూనివర్స్ నుంచి తాజాగా మరో సినిమా రాబోతున్నట్లు తెలుస్తుంది.
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా ప్రశాంత్ వర్మ ఒక సినిమా చేయబోతున్నట్లు తెలుస్తుంది. ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్‌లో భాగంగా ఈ సినిమా రానుండగా.. ఈ సినిమాను ప్రభాస్ పుట్టినరోజు కానుకగా.. అక్టోబర్ 23న అనౌన్స్మెంట్ ఇవ్వనున్నట్లు సమాచారం. అగ్ర నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ ఈ ప్రాజెక్ట్‌ను నిర్మిస్తోందని సమాచారం. అయితే ఈ కాంబినేషన్లో వచ్చే ఈ మూవీ సోషియో ఫాంటసీనా లేక ఫుల్ యాక్షన్ ఎంటర్టైనరా? అని అప్పుడే ఫ్యాన్స్ చర్చించుకోవడం మొదలు పెట్టారు.